క్వార్టర్స్‌లో లక్ష్యసేన్
ABN, Publish Date - Nov 22 , 2024 | 04:47 AM
లక్ష్యసేన్, స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్/చిరాగ్ చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నీ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు. అయితే పీవీ సింధు రెండో రౌండ్లోనే వెనుదిరిగింది. గురువారం జరిగిన రౌండ్-16లో లక్ష్యసేన్ 21-16, 21-18తో జమ్కే (డెన్మార్క్)ని చిత్తు చేశాడు...
రెండో రౌండ్లో సింధు ఓటమి
చైనా మాస్టర్స్
షెన్జెన్ (చైనా): లక్ష్యసేన్, స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్/చిరాగ్ చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నీ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు. అయితే పీవీ సింధు రెండో రౌండ్లోనే వెనుదిరిగింది. గురువారం జరిగిన రౌండ్-16లో లక్ష్యసేన్ 21-16, 21-18తో జమ్కే (డెన్మార్క్)ని చిత్తు చేశాడు. ఇక సాత్విక్/చిరాగ్ 21-19, 21-15తో జేర్/ఫ్రెడరిక్ (డెన్మార్క్)పై నెగ్గారు. సింధు 21-16, 17-21, 21-23తోయో జియా మిన్ (సింగపూర్) చేతిలో ఓడింది. అనుపమ 7-21, 14-21తో నిదారియా (జపాన్) చేతిలో, మాళవిక 9-21, 9-21తో కటెథాంగ్ (థాయ్‌లాండ్) చేతిలో చిత్తయ్యారు. మహిళల డబుల్స్ రెండో రౌండ్లో గాయత్రి/ట్రీసా ద్వయం 16-11, 11-21తో చైనా జంట లియు/షువా చేతిలో ఓటమి చవిచూసింది. మిక్స్డ్ డబుల్స్ రౌండ్-16లో సుమిత్ రెడ్డి/సిక్కి రెడ్డి జోడీ ప్రత్యర్థికి వాకోవర్ ఇచ్చింది.
Updated Date - Nov 22 , 2024 | 04:47 AM