IPL 2024: మార్కస్ స్టోయినిస్ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా..
ABN, Publish Date - Apr 24 , 2024 | 11:17 AM
ఐపీఎల్-2024 కీలక దశకు చేరుకుంది. అన్ని జట్లూ తమ సత్తా మేరకు ఆడుతూ విజయం కోసం శ్రమిస్తున్నాయి. మంగళవారం చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
ఐపీఎల్-2024 (IPL 2024) కీలక దశకు చేరుకుంది. అన్ని జట్లూ తమ సత్తా మేరకు ఆడుతూ విజయం కోసం శ్రమిస్తున్నాయి. మంగళవారం చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది (LSG vs CSK). ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ ఆటగాడు మార్కస్ స్టోయినిస్ (Marcus Stoinis) విశ్వరూపం ప్రదర్శించాడు. అద్భుత ఆటతీరుతో సెంచరీ సాధించి తన జట్టును గెలిపించాడు.
ఈ మ్యాచ్‌లో స్టోయినిస్ 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రికార్డు నమోదు చేశాడు. 211 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో స్టోయినిస్ అమోఘమైన ఆటతీరు ప్రదర్శించాడు. చెన్నై బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. 63 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 6 సిక్స్‌లతో 124 పరుగులు చేశాడు. ఆ క్రమంలో ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో ఛేజింగ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇది ఐపీఎల్‌లో ఆల్‌టైమ్ రికార్డుగా నిలిచింది.
మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 210/4 స్కోరు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (108 నాటౌట్), శివమ్ దూబే (66) రాణించారు. ఛేదనలో లఖ్‌నవూ 19.3 ఓవర్లలో 4 వికెట్లకు 213 రన్స్ చేసి గెలిచింది. పూరన్ (34) రాణించాడు. స్టోయినిస్‌కు ``మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్`` అవార్డు దక్కింది.
ఇవి కూడా చదవండి..
IPL 2024: పాయింట్ల పట్టికలో సంచలన మార్పు.. టాప్ 4లోకి
IPL 2024: నేడు DC vs GT మ్యాచ్.. గెలవకుంటే ప్లేఆఫ్ రేసు నుంచి
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 24 , 2024 | 11:17 AM