ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

LSG VS MI : గట్టెక్కిన జెయింట్స్‌

ABN, Publish Date - May 01 , 2024 | 05:04 AM

ఆఖరి ఓవర్‌ వరకూ ఉత్కంఠగా సాగిన లోస్కోరింగ్‌ మ్యాచ్‌లో.. నెగ్గిన లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ ప్లేఆ్‌ఫ్సకు మరింత చేరువైంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ స్టొయినిస్‌ (45 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62) అర్ధ శతకంతోపాటు బౌలర్లు రాణించడంతో.. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ

స్టొయినిస్‌ (45 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 62)

పోరాడి ఓడిన ముంబై

ప్లేఆఫ్స్‌ రేసు నుంచి హార్దిక్‌ సేన అవుట్‌?

లఖ్‌నవూ: ఆఖరి ఓవర్‌ వరకూ ఉత్కంఠగా సాగిన లోస్కోరింగ్‌ మ్యాచ్‌లో.. నెగ్గిన లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ ప్లేఆ్‌ఫ్సకు మరింత చేరువైంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ స్టొయినిస్‌ (45 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62) అర్ధ శతకంతోపాటు బౌలర్లు రాణించడంతో.. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ 4 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై గెలిచింది. తొలుత ముంబై 20 ఓవర్లలో 144/7 స్కోరు చేసింది. నేహల్‌ వధేరా (46), టిమ్‌ డేవిడ్‌ (35 నాటౌట్‌), ఇషాన్‌ కిషన్‌ (32) ఫర్వాలేదనిపించారు. ఛేదనలో లఖ్‌నవూ 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులు చేసి గెలిచింది. రాహుల్‌ (28) రాణించాడు. ఈ విజయంతో లఖ్‌నవూ 3వ స్థానానికి ఎగబాకగా.. ఏడో ఓటమితో ముంబై నాకౌట్‌ అవకాశాలు దాదాపుగా ముగిశాయి. గాయం నుంచి కోలుకొని ఈ మ్యాచ్‌లో ఆడిన మయాంక్‌ 3.1 ఓవర్లు బౌల్‌ చేసిన తర్వాత మళ్లీ నొప్పితో మైదానం వీడాడు.

ఆఖర్లో ఒత్తిడి: స్వల్ప ఛేదనలో స్టొయినిస్‌ రాణించినా.. లఖ్‌నవూ కష్టంగానే గట్కెక్కింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన అరంగేట్రం ఆటగాడు అర్షిన్‌ కులకర్ణి (0)ని తుషార గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌ చేర్చాడు. అయితే, రాహుల్‌కు జత కలసిన స్టొయినిస్‌ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరోవైపు రాహుల్‌.. 5వ ఓవర్‌లో తుషార బౌలింగ్‌లో 4,6,4,4తో 20 రన్స్‌ రాబట్టాడు. పవర్‌ప్లే ముగిసేసరికి లఖ్‌నవూ 52/1తో నిలిచింది. కాగా, ధాటిగా ఆడుతున్న రాహుల్‌ను అవుట్‌ చేసిన హార్దిక్‌.. రెండో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఈ దశలో స్టొయినిస్‌, దీపక్‌ హుడా (18) సంయమనంతో ఆడడంతో 10 ఓవర్లకు లఖ్‌నవూ 79/2తో మెరుగ్గానే కనిపించింది. అయితే, హుడాను పాండ్యా అవుట్‌ చేశాడు. నబి బౌలింగ్‌లో స్టొయినిస్‌ కూడా అదే ఓవర్‌లో అవుటయ్యాడు. చివరి 5 ఓవర్లలో సూపర్‌ జెయింట్స్‌ విజయానికి 29 రన్స్‌ కావాల్సి ఉండగా.. పూరన్‌ (14 నాటౌట్‌), టర్నర్‌ (5) నెమ్మదిగా ఆడడంతో ఆందోళన రేగింది. పైగా 17వ ఓవర్‌ బౌల్‌ చేసిన బుమ్రా ఒక్క పరుగే ఇవ్వగా.. తర్వాతి ఓవర్‌ తొలి బంతికే టర్నర్‌ను కొట్జీ బౌల్డ్‌ చేసి షాకిచ్చాడు. ఇక, బదోని (6) రనౌటైనా.. ఒత్తిడి మధ్య పూరన్‌ మ్యాచ్‌ను ముగించాడు.

టాప్‌ ఢమాల్‌: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హార్దిక్‌ సేన ఆరంభంలోనే తడబడింది. రోహిత్‌ (4)ను మొహిసిన్‌ స్వల్ప స్కోరుకే క్యాచవుట్‌ చేయగా.. ఽసూర్యకుమార్‌ (10)ను స్టొయినిస్‌ వెనక్కిపంపాడు. తిలక్‌ వర్మ (7) రనౌట్‌ కాగా.. హార్దిక్‌ (0)ను నవీనుల్‌ డకౌట్‌ చేశాడు. దీంతో పవర్‌ప్లేలో ముంబై 28/4తో కష్టాల్లో పడింది. ఈ దశలో ఓపెనర్‌ ఇషాన్‌, వధేరా ఐదో వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొనే ప్రయత్నం చేశారు. 9వ ఓవర్‌లో మయాంక్‌ బౌలింగ్‌లో కిషన్‌ ఇచ్చిన క్యాచ్‌ను టర్నర్‌ చేజార్చాడు. అయితే, గేర్‌ మార్చే ప్రయత్నం చేస్తున్న ఇషాన్‌ను బిష్ణోయ్‌ బోల్తా కొట్టించాడు. ఆ తర్వాతి ఓవర్‌లో మయాంక్‌ బౌలింగ్‌లో వధేరా 6,6,4తో 16 పరుగులతో స్కోరు వేగం పెంచారు. అర్ధ శతకానికి చేరువవుతున్న తరుణంలో వధేరాను మొహిసిన్‌ అద్భుతమైన యార్కర్‌తో బౌల్డ్‌ చేయగా.. నబి (1)ని మయాంక్‌ అవుట్‌ చేశాడు. కానీ, డెత్‌లో డేవిడ్‌ కొంత ధాటిగా ఆడడంతో ముంబై 140 మార్క్‌ అయినా దాటింది.

స్కోరుబోర్డు

ముంబై: ఇషాన్‌ (సి) మయాంక్‌ (బి) బిష్ణోయ్‌ 32, రోహిత్‌ (సి) స్టొయినిస్‌ (బి) మొహిసిన్‌ 4, సూర్యకుమార్‌ (సి) రాహుల్‌ (బి) స్టొయినిస్‌ 10, తిలక్‌ (రనౌట్‌) 7, హార్దిక్‌ (సి) రాహుల్‌ (బి) నవీనుల్‌ 0, నేహల్‌ (బి) మొహిసిన్‌ 46, టిమ్‌ డేవిడ్‌ (నాటౌట్‌) 35, నబీ (బి) మయాంక్‌ 1, కొట్జీ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 144/7; వికెట్ల పతనం: 1-7, 2-18, 3-27, 4-27, 5-80, 6-112, 7-123; బౌలింగ్‌: స్టొయినిస్‌ 3-0-19-1, మొహిసిన్‌ 4-0-36-2, నవీనుల్‌ 3.5-0-15-1, మయాంక్‌ యాదవ్‌ 3.1-0-31-1, రవి బిష్ణోయ్‌ 4-0-28-1, దీపక్‌ హుడా 2-0-13-0.

లఖ్‌నవూ: రాహుల్‌ (సి) నబీ (బి) హార్దిక్‌ 28, అర్షిన్‌ (ఎల్బీ) తుషార 0, స్టొయినిస్‌ (సి) తిలక్‌ (బి) నబీ 62, దీపక్‌ హుడా (సి) బుమ్రా (బి) హార్దిక్‌ 18, పూరన్‌ (నాటౌట్‌) 14, టర్నర్‌ (బి) కొట్జీ 5, బదోని (రనౌట్‌) 6, క్రునాల్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 19.2 ఓవర్లలో 145/6; వికెట్ల పతనం: 1-1, 2-59, 3-99, 4-115, 5-123, 6-133; బౌలింగ్‌: తుషార 4-0-30-1, బుమ్రా 4-0-17-0, కొట్జీ 3-0-29-1, పీయూష్‌ 3-0-23-0, హార్దిక్‌ 4-0-26-2, నబీ 1.2-0-16-1.


Updated Date - May 01 , 2024 | 06:34 AM

Advertising
Advertising