T20 Worldcup: ఇదీ భారతీయుల సంస్కారం.. రోహిత్ ప్రవర్తనను మెచ్చుకుంటూ ఆస్ట్రేలియన్లపై ట్రోలింగ్!
ABN, Publish Date - Jul 06 , 2024 | 10:43 AM
టీ20 ప్రపంచకప్‌ను భారత్ చేజిక్కించుకోవడంతో భావోద్వేగాలు తారస్థాయికి చేరాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించగానే క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లే కాదు.. అభిమానుల కళ్లు కూడా చెమర్చాయి. ఇక, మైదానంలోని క్రికెటర్లు అయితే ఒకరిని ఒకరు హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.
టీ20 ప్రపంచకప్ (T20 Worldcup)ను భారత్ చేజిక్కించుకోవడంతో భావోద్వేగాలు తారస్థాయికి చేరాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో (Ind vs SA) టీమిండియా విజయం సాధించగానే క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లే కాదు.. అభిమానుల కళ్లు కూడా చెమర్చాయి. ఇక, మైదానంలోని క్రికెటర్లు అయితే ఒకరిని ఒకరు హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) బార్బొడాస్ పిచ్‌పై భారత జెండాను రెపరెపలాడించాడు. అనంతరం బార్బొడాస్ పిచ్ (Barbados Pitch) మట్టిని నోట్లో పెట్టుకున్నాడు.
బార్బొడాస్ పిచ్ మట్టిని రుచి చూస్తున్న రోహిత్ శర్మ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఏకంగా ప్రధాని మోదీ కూడా ఈ విషయం గురించి రోహిత్‌తో ప్రస్తావించారు. ఇక, అభిమానులు రోహిత్ ప్రవర్తనను గతేడాది వన్డే ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా క్రికెటర్లతో పోలుస్తున్నారు. వన్డే ప్రపంచకప్ గెలిచిన అనంతరం ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ మార్ష్ (Mitchell Marsh) ప్రవర్తన అప్పట్లో వైరల్ అయింది. డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రపంచకప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి మార్ష్ సేద తీరుతున్న ఫొటో అప్పట్లో వైరల్ అయింది (Mitchell Marsh feet on World Cup trophy).
తాజా రోహిత్ శర్మ ప్రవర్తనతో అప్పటి మార్ష్ తీరును పోలుస్తూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ``రోహిత్‌కు మట్టి విలువ తెలుసు. ఈ విజయం ఎంతో కష్టంతో వచ్చింది``, ``ఇది భారతీయుల సంస్కారం``, ``ఇది క్రికెట్‌కు మన వాళ్లు ఇచ్చే గౌరవం``, ``ఆస్ట్రేలియన్లకు క్రికెట్ ఒక క్రీడ మాత్రమే.. మనకు ఓ ఎమోషన్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Rahul Dravid: 92 బంతుల్లో ఒక్క పరుగు.. ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించిన రాహుల్ ద్రవిడ్!
Watch Video:కప్పు అందుకునే సమయంలో అందుకే అలా నడిచా.. ప్రధానితో రోహిత్ ఏం చెప్పాడంటే..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jul 06 , 2024 | 10:43 AM