ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మయాంక్‌, నితీశ్‌ వచ్చేశారు

ABN, Publish Date - Sep 29 , 2024 | 06:12 AM

నిప్పులు చెరిగే బంతులతో బ్యాటర్లలో గుబులు పుట్టిస్తూ ప్రపంచ క్రికెట్‌ను ఆకర్షించిన యువ పేసర్‌ మయాంక్‌ యాదవ్‌కు టీమిండియాలో తొలిసారి చోటు దక్కింది.

  • బంగ్లాదేశ్‌తో మూడు టీ20లకు టీమిండియా ఎంపిక

న్యూఢిల్లీ: నిప్పులు చెరిగే బంతులతో బ్యాటర్లలో గుబులు పుట్టిస్తూ ప్రపంచ క్రికెట్‌ను ఆకర్షించిన యువ పేసర్‌ మయాంక్‌ యాదవ్‌కు టీమిండియాలో తొలిసారి చోటు దక్కింది. బంగ్లాదేశ్‌తో జరిగే మూడు టీ20లకు శనివారం ఎంపిక చేసిన జట్టులో 22 ఏళ్ల ఢిల్లీ పేస్‌ సంచలనానికి సెలెక్టర్లు స్థానం కల్పించారు. సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యం వహించే 15 మంది జట్టులో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యానూ చేర్చారు. గతంలో జింబాబ్వే పర్యటనకు ఎంపికైనా..గాయంతో ఆ టూర్‌ను మిస్సయిన తెలుగు ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి కూడా చోటు నిలబెట్టుకున్నాడు. ఇక పనిభారం రీత్యా గిల్‌, జైస్వాల్‌, పంత్‌, బుమ్రా, సిరాజ్‌లకు విశ్రాంతి ఇచ్చారు. మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి మూడు సంవత్సరాల అనంతరం జాతీయ జట్టులో పునరాగమనం చేశాడు. కీపర్‌, బ్యాటర్‌ జితేశ్‌ శర్మకు కూడా స్థానం లభించింది. అయితే సంజూ శాంసన్‌ ప్రధాన కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తొలి టీ20 వచ్చేనెల ఆరున గ్వాలియర్‌ జరగనుంది. తొమ్మిదిన న్యూఢిల్లీలో రెండో మ్యాచ్‌, 12న హైదరాబాద్‌లో ఆఖరి టీ20 జరగనుంది.

  • భారత జట్టు

సూర్యకుమార్‌ (కెప్టెన్‌), అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌ (కీపర్‌), రింకూ సింగ్‌, హార్దిక్‌ పాండ్యా, రియాన్‌ పరాగ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, శివమ్‌ దూబే, వాషింగ్టన్‌ సుందర్‌, రవి బిష్ణోయ్‌, వరుణ్‌ చక్రవర్తి, జితేశ్‌ శర్మ (కీపర్‌), అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షిత్‌ రాణా, మయాంక్‌ యాదవ్‌.

  • ఎక్స్‌ప్రెస్‌ వేగంతో..

రెండేళ్ల కిందటే ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అడుగుపెట్టిన మయాంక్‌..ఎక్స్‌ప్రెస్‌ వేగంతో బంతులు విసురుతూ అబ్బురపరిచాడు. లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ తరపున ఈసారి ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అతడు..తొలి రెండు మ్యాచ్‌ల్లోనే గంటకు 156 కి.మీ. వేగంతో బౌలింగ్‌ చేసి బ్యాటర్లను గడగడలాడించాడు. కానీ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండుసార్లు గాయపడడంతో..టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. లేదంటే టీ20 వరల్డ్‌ కప్‌నకే మయాంక్‌ ఎంపికయ్యేవాడని భావించారు. అనంతరం గాయం నుంచి కోలుకున్న యాదవ్‌ను ఇటీవల జాతీయ క్రికెట్‌ అకాడమీలో జరిగిన ప్రత్యేక శిబిరానికి ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు.

Updated Date - Sep 29 , 2024 | 06:12 AM