మళ్లీ మయాంకే..
ABN, Publish Date - Apr 03 , 2024 | 01:46 AM
అదే జోరు.. అదే వేగం.. స్పీడ్‌గన్ మయాంక్ యాదవ్ (3/14)ను ఎదుర్కొనేందుకు బ్యాటర్లు బెంబేలెత్తుతున్నారు. ఈసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డాడు. ఏకంగా తాజా సీజన్‌లోనే అత్యంత (156.7) వేగంగా బంతి విసిరి...
నేటి మ్యాచ్
ఢిల్లీ గీ కోల్‌కతా, రా.7.30 నుంచి
3 వికెట్లతో అదరగొట్టిన పేసర్
లఖ్‌నవూ ఘనవిజయం జూ బెంగళూరు చిత్తు
బెంగళూరు: అదే జోరు.. అదే వేగం.. స్పీడ్‌గన్ మయాంక్ యాదవ్ (3/14)ను ఎదుర్కొనేందుకు బ్యాటర్లు బెంబేలెత్తుతున్నారు. ఈసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డాడు. ఏకంగా తాజా సీజన్‌లోనే అత్యంత (156.7) వేగంగా బంతి విసిరి లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు స్టార్ అట్రాక్షన్‌గా మారాడు. అతడికి జతగా మిగిలిన బౌలర్లు కూడా రాణించడంతో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ 28 పరుగులతో నెగ్గింది. సొంతగడ్డపై ఆర్‌సీబీకిది వరుసగా రెండో ఓటమి. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ 20 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులు చేసింది. డికాక్ (56 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 81), పూరన్ (21 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సర్లతో 40 నాటౌట్) ఆకట్టుకున్నారు. ఛేదనలో బెంగళూరు 19.4 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది. లొమ్రోర్ (13 బంతుల్లో 33), రజత్ (29), విరాట్ (22) ఓ మాదిరిగా రాణించారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా మయాంక్ యాదవ్ నిలిచాడు.
ఆరంభంలోనే..: ఛేదనలో ఆర్‌సీబీ తడ‘బ్యాటు’ కొనసాగింది. పవర్‌ప్లేలోనే విరాట్, డుప్లెసి (19), మ్యాక్స్‌వెల్ (0) వికెట్లను కోల్పోయి బేలగా కనిపించింది. కానీ తొలి నాలుగు ఓవర్లలో ఓపెనర్లు ఆడిన తీరు చూస్తే జట్టు విజయం లాంఛనమే అనిపించింది. కానీ వరుస ఓవర్లలో విరాట్‌ను స్పిన్నర్ సిద్దార్థ్, మ్యాక్స్‌వెల్‌ను పేసర్ మయాంక్ అవుట్ చేయగా, డుప్లెసి రనౌటయ్యాడు. ఇక మయాంక్ తన బుల్లెట్‌లాంటి బంతులతో గ్రీన్ (9)ను సైతం పెవిలియన్‌కు చేర్చడంతో 58/4తో ఆర్‌సీబీ పోటీలోకి రాలేకపోయింది. ఈ దశలో రజత్-అనూజ్ (11)తో కలిసి ఐదో వికెట్‌కు 36 పరుగులు జోడించాడు. కానీ మయాంక్ తన చివరి ఓవర్‌లో రజత్‌ను అవుట్ చేసి వరుసగా రెండో మ్యాచ్‌లోనూ మూడు వికెట్లను సాధించాడు. అటు చివరి 30 బంతుల్లో 78 రన్స్ కావాల్సిన వేళ లొమ్రోర్ యధేచ్ఛగా బ్యాట్ ఝుళిపించాడు. 16వ ఓవర్‌లో 19 రన్స్ అందించి, తర్వాతి ఓవర్‌లోనూ మెరిసి ఆశలు రేపాడు. కానీ అదే ఓవర్‌లో దినేశ్ కార్తీక్ (4) కీపర్ రాహుల్‌కు క్యాచిచ్చాడు. లొమ్రోర్‌ను యష్ అవుట్ చేయడంతో ఆర్‌సీబీ చేసేదేమీ లేకపోయింది. సిరాజ్ (12) చివర్లో రెండు సిక్సర్లతో ఆకట్టుకున్నాడు.
స్కోరుబోర్డు
లఖ్‌నవూ : డికాక్ (సి) దాగర్ (బి) టోప్లే 81, రాహుల్ (సి) దాగర్ (బి) మ్యాక్స్‌వెల్ 20, పడిక్కళ్ (సి) అనూజ్ రావత్ (బి) సిరాజ్ 6, స్టొయినిస్ (సి) దాగర్ (బి) మ్యాక్స్‌వెల్ 24, పూరన్ (నాటౌట్) 40, ఆయుష్ (సి) డుప్లెసి (బి) యశ్ 0, క్రునాల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం 20 ఓవర్లలో 181/5; వికెట్ల పతనం: 1-53, 2-73, 3-129, 4-143, 5-148; బౌలింగ్: టోప్లే 4-0-39-1, యశ్ దయాల్ 4-0-24-1, సిరాజ్ 4-0-47-1, మ్యాక్స్‌వెల్ 4-0-23-2, దాగర్ 2-0-23-0, గ్రీన్ 2-0-25-0.
బెంగళూరు: కోహ్లీ (సి) పడిక్కళ్ (బి) సిద్దార్ధ్ 22, డుప్లెసి-రనౌట్ (పడిక్కళ్) 19, పటీదార్ (సి) పడిక్కళ్ (బి) మయాంక్ 29, మ్యాక్స్‌వెల్ (సి) పూరన్ (బి) మయాంక్ 0, గ్రీన్ (బి) మయాంక్ 9, రావత్ (సి) పడిక్కళ్ (బి) స్టొయినిస్ 11, లొమ్రోర్ (సి) పూరన్ (బి) ఠాకూర్ 33, కార్తీక్ (సి) రాహుల్ (బి) నవీనుల్ 4, దాగర్-రనౌట్ (పూరన్) 0, టోప్లే (నాటౌట్) 3, సిరాజ్ (సి) పూరన్ (బి) నవీనుల్ 12, ఎక్స్‌ట్రాలు11, మొత్తం: 19.4 ఓవర్లలో 153 ఆలౌట్; వికెట్లపతనం: 1-40, 2-42, 3-43, 4-58, 5-94, 6-103, 7-136, 8-137, 9-138; బౌలింగ్: సిద్దార్ధ్ 3-0-21-1, కృనాల్ 1-0-10-0, నవీనుల్ 3.4-0-25-2, మయాంక్ యాదవ్ 4-0-14-3, బిష్ణోయ్ 3-0-33-0, యశ్ ఠాకూర్ 4-0-38-1, స్టొయినిస్ 1-0-9-1.
తక్కువ ఇన్నింగ్స్ (99)లో 3 వేల రన్స్ సాధించిన ఆరో ఐపీఎల్ బ్యాటర్‌గా డికాక్. తొలి స్థానంలో గేల్ (75) ఉన్నాడు.
పాయింట్ల పట్టిక
జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే
రాజస్థాన్ 3 3 0 0 6 1.249
కోల్‌కతా 2 2 0 0 4 1.047
చెన్నై 3 2 1 0 4 0.976
లఖ్‌నవూ 3 2 1 0 4 0.483
గుజరాత్ 3 2 1 0 4 -0.738
హైదరాబాద్ 3 1 2 0 2 0.204
ఢిల్లీ 3 1 2 0 2 -0.016
పంజాబ్ 3 1 2 0 2 -0.337
బెంగళూరు 4 1 3 0 2 -0.876
ముంబై 3 0 3 0 0 -1.423
గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;
ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్ రన్‌రేట్
Updated Date - Apr 03 , 2024 | 01:46 AM