ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పాలబుగ్గల ప్రాయం.. నైపుణ్యాలు అమోఘం

ABN, Publish Date - Nov 28 , 2024 | 04:41 AM

ప్రపంచ చెస్‌ వినీలాకాశంలో మరో భారత తార ఉద్భవించింది. హైదరాబాద్‌కు చెందిన పాల బుగ్గల పిల్లోడు దివిత్‌ అండర్‌-8 వరల్డ్‌ క్యాడెట్‌ చెస్‌ చాంపియన్‌షి్‌ప టైటిల్‌ అందుకొని భారత్‌ చెస్‌ చరిత్రలో మరో అధ్యాయాన్ని ప్రారంభించాడు...

చెస్‌ వండర్‌ దివిత్‌

ప్రపంచ చెస్‌ వినీలాకాశంలో మరో భారత తార ఉద్భవించింది. హైదరాబాద్‌కు చెందిన పాల బుగ్గల పిల్లోడు దివిత్‌ అండర్‌-8 వరల్డ్‌ క్యాడెట్‌ చెస్‌ చాంపియన్‌షి్‌ప టైటిల్‌ అందుకొని భారత్‌ చెస్‌ చరిత్రలో మరో అధ్యాయాన్ని ప్రారంభించాడు. రెండేళ్ల కిందటే తన అద్భుత నైపుణ్యాలతో ప్రస్తుతం ప్రపంచ చెస్‌ టైటిల్‌ కోసం తలపడుతున్న గుకే్‌షను సంభ్రమాశ్చర్యాలకు లోనుచేశాడు దివిత్‌. హైదరాబాద్‌లో జరిగిన ఆ ఎగ్జిబిషన్‌ చెస్‌ టోర్నీ సందర్భంగా ఎండ్‌ గేమ్‌లో దివిత్‌ వేసిన ఎత్తులతో గుకేష్‌ షాకయ్యాడు. ఆ టోర్నీలో గుకే్‌షతోపాటు తెలంగాణ స్టార్‌ అర్జున్‌తో దివిత్‌ తలపడడం విశేషం. ‘ఈ బాలుడు అమోఘంగా ఆడుతున్నాడు. నిజం చెప్పాలంటే అతడి ఆట నన్ను షాక్‌కు గురి చేసింది’ అని గుకేష్‌ అనడం దివిత్‌ ప్రతిభకు అద్దం పడుతుంది. సీన్‌ కట్‌ చేస్తే..


ప్రస్తుతం డింగ్‌ లిరెన్‌తో వరల్డ్‌ చెస్‌ టైటిల్‌ కోసం గుకేష్‌ తలపడుతున్నాడు. అదే సమయంలో ఇటలీలో జరిగిన పోటీలలో దివిత్‌ అండర్‌-8 ప్రపంచ క్యాడెట్‌ చాంపియన్‌గా నిలిచి సంచలనం సృష్టించాడు. 1784 ఫిడే రేటింగ్‌ పాయింట్లు కలిగిన దివిత్‌ అండర్‌-8 ప్రపంచ చెస్‌ చాంపియన్‌షి్‌పలో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచాడు. ఇందులో రెండు గేముల్లో తనకంటే ఎంతో మెరుగైన ప్రత్యర్థులను అతడు మట్టి కరిపించాడు.


చిన్నతనంలోనే మెరుపులు..

దివిత్‌ తల్లిదండ్రులు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు. చాలా చిన్నతనంనుంచే తమ కుమారుడు పజిల్స్‌ పరిష్కరించడంపట్ల అమితాసక్తి కనబరుస్తుండడాన్ని వారు గమనించారు. దాంతో హైదరాబాద్‌లోని ఓ పజిల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో దివిత్‌ను చేర్పించారు. అక్కడ నుంచి ఆ చిన్నారి అడుగులు క్రమంగా చెస్‌వైపు పడ్డాయి. ఆరేళ్లకే అండర్‌-8 జాతీయ చెస్‌ పోటీల్లో పాల్గొని సత్తా చాటాడు. అనంతరం పోలవరపు రామకృష్ణ శిక్షణలో దివిత్‌ పూర్తిస్థాయి చెస్‌ పయనం మొదలైంది. రామకృష్ణ విశాఖపట్నానికి చెందిన వ్యక్తి కావడంతో తొలుత దివిత్‌ చెస్‌ క్లాస్‌లన్నీ ఆన్‌లైన్‌లోనే సాగేవి. చెస్‌పై మరింత దృష్టిపెట్టే క్రమంలో దివిత్‌ చదువు కూడా ఆన్‌లైన్‌లో కొనసాగింది. దివిత్‌కు అద్భుత వ్యూహాత్మక సామర్థ్యాలున్నాయి. అతడి ఎత్తులు సంక్లిష్టంగా ఉంటాయి. గ్యారీ కాస్పరోవ్‌..దివిత్‌ ఆరాధ్య ఆటగాడు. దివిత్‌ ఎత్తులు కూడా కాస్పరోవ్‌ వలే చాలా దూకుడుగా ఉంటాయి. ఓడిపోయిన దశ నుంచి పుంజుకొని దివిత్‌ గెలిచిన గేమ్‌లు ఎన్నో. అయితే క్లిష్టమైన ఎత్తుగడలు ఒక్కోసారి దివిత్‌కు పరాజయాలూ తెచ్చిపెట్టకపోలేదు. చెస్‌ కెరీర్‌ ఆరంభంలో దివిత్‌ ఆశాజనక ఫలితాలు సాధించలేదు. క్లాసికల్‌ టోర్నమెంట్‌లో విజయాలు దక్కలేదు. అండర్‌-7 జాతీయ చాంపియన్‌షి్‌పలో ఏడో స్థానంతో నిరాశ పరిచాడు. గత ఏప్రిల్‌లో ఆర్మేనియాలో జరిగిన ర్యాపిడ్‌ ఏజ్‌ గ్రూప్‌ టోర్నీ టైటిల్‌ నెగ్గడం ద్వారా దివిత్‌ ప్రపంచ చెస్‌ దృష్టిని ఆకర్షించాడు.


అదే టోర్నీ..బ్లిట్జ్‌ కేటగిరీలో కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. అండర్‌-8 వరల్డ్‌ కప్‌ క్లాసికల్‌ విభాగంలో ఐదో స్థానం సంపాదించాడు. ఈ ఫలితాలు అండర్‌-8 ప్రపంచ చాంపియన్‌షి్‌పనకు దివిత్‌లో ఎంతో ఆత్మవిశ్వాసం ఇచ్చాయి. ఈ సంవత్సరం దివిత్‌ 8 నుంచి 10 రేటెడ్‌ టోర్నీలలో పాల్గొన్నాడు. ఇందులో మూడు ప్రపంచ టోర్నమెంట్‌లూ ఉన్నాయి. ప్రస్తుతం పిన్నవయస్సు గ్రాండ్‌ మాస్టర్‌ రికార్డు అమెరికాకు చెందిన అభిమన్యు మిశ్రా (12 ఏళ్ల 4 నెలల 25 రోజులు) పేరిట ఉంది. దివిత్‌ సంచలన విజయాలను పరిగణనలోకి తీసుకుంటే ఆ రికార్డును హైదరాబాద్‌ చిన్నోడు చేజిక్కించుకొనే అవకాశాలు లేకపోలేదు.

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

Updated Date - Nov 28 , 2024 | 04:41 AM