ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Jasprit Bumrah: అరుదైన ఘనత సాధించిన బుమ్రా.. సిరాజ్ ఎలా అభినందించాడో చూడండి..

ABN, Publish Date - Apr 12 , 2024 | 08:50 PM

ముంబై ఇండియన్స్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ కెరీర్‌లో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వాంఖడే వేదికగా గురువారం ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టాడు.

బుమ్రా

ముంబై ఇండియన్స్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఐపీఎల్ (IPL 2024) కెరీర్‌లో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వాంఖడే వేదికగా గురువారం ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది (MI vs RCB). ఈ మ్యాచ్‌లో బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ కెరీర్‌లో రెండోసారి ఐదు వికెట్లు పడగొట్టిన అరుదైన ఘనతను బుమ్రా సొంతం చేసుకున్నాడు. బుమ్రా కంటే ముందు జేమ్స్ ఫాల్కనర్, జయదేవ్ ఉనద్కత్, భువనేశ్వర్ కుమార్ మాత్రమే రెండు సార్లు ఐదు వికెట్లు పడగొట్టారు (Jasprit Bumrah Record).


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై ఐదు వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. అలాగే ఆర్సీబీపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఇరు జట్ల అటగాళ్లు కలుసుకున్న సందర్భంలో ఆర్సీబీ బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) ముందుకు వంగి బుమ్రాకు అభివాదం చేశాడు. మెరుగైన ప్రదర్శన చేసిన బుమ్రాను తనదైన శైలిలో అభినందించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.


గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగులు చేసింది. డుప్లెసి (40 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 61), దినేశ్‌ కార్తీక్‌ (23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 53 నాటౌట్‌), రజత్‌ పటీదార్‌ (26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 50) అర్ధసెంచరీలు సాధించారు. ఛేదనలో ముంబై 15.3 ఓవర్లలో 3 వికెట్లకు 199 పరుగులు చేసి నెగ్గింది. ఇషాన్ కిషన్‌ (69), సూర్యకుమార్‌ (52) మెరుపు వేగంతో ఆడి విజయం ఖరారు చేశారు. ఐదు వికెట్లు పడగొట్టిన బుమ్రా మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఇవి కూడా చదవండి..

Rohit Sharma: రిటైర్మెంట్ ఊహాగానాలు.. రోహిత్ శ‌ర్మ ఏమ‌న్నాడో తెలుసా?


Rajamouli-David Warner: రాజమౌళి డైరెక్షన్‌లో డేవిడ్ వార్నర్.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..!


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 12 , 2024 | 08:50 PM

Advertising
Advertising