ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ముఖేష్‌ డబుల్‌ ధమాకా

ABN, Publish Date - Oct 02 , 2024 | 01:38 AM

ఐఎ్‌సఎ్‌సఎఫ్‌ జూనియర్‌ షూటింగ్‌ వరల్డ్‌కప్‌లో గుంటూరు షూటర్‌ ముఖేష్‌ నేలవల్లి ఒకే రోజు రెండు స్వర్ణాలు సొంతం చేసుకుని సంచలనం సృష్టించాడు. ఈ పోటీల్లో ముఖే్‌షకు...

షూటింగ్‌ వరల్డ్‌కప్‌

న్యూఢిల్లీ: ఐఎ్‌సఎ్‌సఎఫ్‌ జూనియర్‌ షూటింగ్‌ వరల్డ్‌కప్‌లో గుంటూరు షూటర్‌ ముఖేష్‌ నేలవల్లి ఒకే రోజు రెండు స్వర్ణాలు సొంతం చేసుకుని సంచలనం సృష్టించాడు. ఈ పోటీల్లో ముఖే్‌షకు ఇది మొత్తంగా మూడో పతకం. పెరూ రాజధాని లిమా నగరంలో మంగళవారం జరిగిన పురుషుల 25 మీటర్ల పిస్టల్‌ వ్యక్తిగత, టీమ్‌ ఈవెంట్‌ల్లో ముఖేష్‌ పసిడి పతకాలు కొల్లగొట్టాడు. వ్యక్తిగత విభాగంలో ముఖేష్‌ 585 పాయింట్లతో టాప్‌లో నిలవగా, టీమ్‌ ఈవెం ట్‌లో ముఖేష్‌, సురాజ్‌, ప్రద్యుమ్న సింగ్‌ త్రయం 1729 పాయింట్లతో అగ్రస్థానం దక్కించుకుంది. భారత్‌కే చెందిన మరో షూటర్‌ పార్థ్‌ రాకేశ్‌ రెండు స్వర్ణాలతో అదరగొట్టాడు. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత ఈవెంట్‌లో పార్థ్‌ (250.7 పాయింట్లు) వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచాడు.


10 మీ. ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌లో అజయ్‌ మాలిక్‌, అభినవ్‌ షా, పార్థ్‌ రాకేశ్‌తో కూడిన భారత త్రయం 1883.5 పాయింట్లు స్కోరు చేసి పసిడి అందుకుంది. ఇక, మహిళల 10 మీ. ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌లో గౌతమి భానోత్‌, శాంభవి, అనౌష్క ఠాకూర్‌తో కూడిన భారత్‌ బృందం విజేతగా నిలిచింది.

Updated Date - Oct 02 , 2024 | 01:38 AM