ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Syed Mushtaq Ali T20 : ఫైనల్లో ముంబై, ఎంపీ

ABN, Publish Date - Dec 14 , 2024 | 06:19 AM

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నమెంట్‌లో మధ్యప్రదేశ్‌, ముంబై జట్లు ఫైనల్లో అమీతుమీకి సిద్ధమయ్యాయి. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో వెటరన్‌ ఆటగాడు అజింక్యా రహానె (98)

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ

బెంగళూరు: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నమెంట్‌లో మధ్యప్రదేశ్‌, ముంబై జట్లు ఫైనల్లో అమీతుమీకి సిద్ధమయ్యాయి. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో వెటరన్‌ ఆటగాడు అజింక్యా రహానె (98) అదరగొట్టడంతో ముంబై 6 వికెట్లతో బరోడాను ఓడించింది. తొలుత బరోడా 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేసింది. శివాలిక్‌ (36 నాటౌట్‌), శాశ్వత్‌ రావత్‌ (33), కెప్టెన్‌ క్రునాల్‌ (30) ఫర్వాలేదనిపించారు. ఛేదనలో రహానెకు తోడు సారథి శ్రేయాస్‌ అయ్యర్‌ (46) ఆకట్టుకోవడంతో ముంబై 17.2 ఓవర్లలో 164/4 స్కోరు చేసి గెలిచింది. ఫైనల్‌ ఆదివారం జరగనుంది. ఇక మరో సెమీ్‌సలో ఎంపీ 7 వికెట్లతో ఢిల్లీపై గెలిచింది. మొదట ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 146 పరుగులు చేసింది. అనూజ్‌ రావత్‌ (33 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌. ఛేదనలో కెప్టెన్‌ రజత్‌ పటీదార్‌ (66 నాటౌట్‌) అజేయ అర్ధసెంచరీతో సత్తా చాటడంతో ఎంపీ 15.4 ఓవర్లలో 152/3 స్కోరు చేసి గెలిచింది. హర్‌ప్రీత్‌ సింగ్‌ (46 నాటౌట్‌), హరీశ్‌ గావ్లీ (30) రాణించారు.

Updated Date - Dec 14 , 2024 | 06:19 AM