ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

MI vs GT : ముంబై.. అదే తీరు!

ABN, Publish Date - Mar 25 , 2024 | 04:38 AM

ఐపీఎల్‌లో తమ ఆరంభ మ్యాచ్‌ను ఓడడం ముంబై ఇండియన్స్‌కు ఆనవాయితీగా మారినట్టుంది. గుజరాత్‌ టైటాన్స్‌ను ఓ మాదిరి స్కోరుకే కట్టడి చేయడంతో 2012 సీజన్‌ తర్వాత తమకు తొలి మ్యాచ్‌ విజయం ఖాయమని ఫ్యాన్స్‌...

నేటి మ్యాచ్‌

బెంగళూరు X పంజాబ్‌, రాత్రి 7.30 గం. నుంచి

ఓటమితో ఆరంభం

గుజరాత్‌ బౌలర్లు అదుర్స్‌

ఆఖరి ఓవర్‌లో విజయం

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌లో తమ ఆరంభ మ్యాచ్‌ను ఓడడం ముంబై ఇండియన్స్‌కు ఆనవాయితీగా మారినట్టుంది. గుజరాత్‌ టైటాన్స్‌ను ఓ మాదిరి స్కోరుకే కట్టడి చేయడంతో 2012 సీజన్‌ తర్వాత తమకు తొలి మ్యాచ్‌ విజయం ఖాయమని ఫ్యాన్స్‌ ఖుషీ అయ్యారు. తీరా చివరి ఆరు ఓవర్లలో.. చేతిలో ఏడు వికెట్లున్నా 48 రన్స్‌ చేయలేక చతికిలపడింది. దీంతో కొత్త కెప్టెన్‌ వచ్చినా వరుసగా 12వ ‘తొలి’ ఓటమి తప్పలేదు. అటు టైటాన్స్‌ బౌలర్లు మాత్రం పట్టు వదలకుండా, కీలక డెత్‌ ఓవర్లలో పైచేయి సాధించడం ఫలితాన్నిచ్చింది. దీంతో ఆదివారం ఉత్కంఠ భరితంగా ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆరు పరుగుల తేడాతో గుజరాత్‌ నెగ్గింది. గిల్‌కు కెప్టెన్‌గా ఇదే తొలి మ్యాచ్‌. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. సాయి సుదర్శన్‌ (45), గిల్‌ (31), తెవాటియా (22) రాణించారు. బుమ్రాకు మూడు, కొట్జీకి రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లకు 162 పరుగులు చేసి ఓడింది. బ్రెవిస్‌ (46), రోహిత్‌ (43), తిలక్‌ (25) ఆకట్టుకున్నారు. స్పెన్సర్‌ జాన్సన్‌, ఉమేశ్‌, ఒమర్జాయ్‌, మోహిత్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా సాయి సుదర్శన్‌ నిలిచాడు.

బౌలింగ్‌ భళా: ఓ మాదిరి ఛేదనలో ముంబైని టైటాన్స్‌ బౌలర్లు అడ్డుకున్నారు. తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ ఇషాన్‌ (0) వెనుదిరగ్గా, అరంగేట్ర బ్యాటర్‌ నమన్‌ ధిర్‌ (20) ఉన్న కాసేపు అదరగొట్టాడు. ఒమర్జాయ్‌ ఓవర్‌లో తను 4,4,4,6 బాది ఆఖరి బంతికి అవుటయ్యాడు. అనంతరం ఓపెనర్‌ రోహిత్‌, డివాల్డ్‌ బ్రెవిస్‌ భారీషాట్లతో జీటీ బౌలర్లను ఆడుకున్నారు. ఇద్దరి జోరుతో ముంబై అవలీలగా గెలుస్తుందనిపించింది. రోహిత్‌ అర్ధసెంచరీకి ముందు 13వ ఓవర్‌లో ఎల్బీ కావడంతో మూడో వికెట్‌కు 77 పరుగుల మెరుపు భాగస్వామ్యం ముగిసింది. ఇక్కడే మ్యాచ్‌ టర్న్‌ అయ్యింది. కాసేపటికే బ్రెవి్‌సను మోహిత్‌ రిటర్న్‌ క్యాచ్‌తో అవుట్‌ చేయగా స్కోరులో వేగం తగ్గింది. ఇక 12 బంతుల్లో 27 రన్స్‌ కావాల్సిన వేళ తిలక్‌, కొట్జీ (1) వికెట్లను పేసర్‌ జాన్సన్‌ తీయడంతో సమీకరణం 19 రన్స్‌కి మారింది. అయితే ఆఖరి ఓవర్‌ తొలి రెండు బాల్స్‌ను హార్దిక్‌ 6,4 బాదడంతో మ్యాచ్‌ ముంబై వైపు మొగ్గింది. కానీ మూడు, నాలుగు బంతుల్లో హార్దిక్‌ (11), పియూష్‌ చావ్లా (0)ల వికెట్లు తీసిన ఉమేశ్‌ గట్టి షాకే ఇచ్చి మ్యాచ్‌ను ముగించాడు.

మెరుపుల్లేవ్‌..: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ ఇన్నింగ్స్‌ వేగంగా ఆరంభమైనా మధ్య ఓవర్లలో భారీ షాట్లు ఆడలేకపోయింది. స్టార్‌ పేసర్‌ బుమ్రా మూడు వికెట్లతో గుజరాత్‌ను కట్టడి చేశాడు. తొలి వికెట్‌కు ఓపెనర్లు సాహా (15), గిల్‌ 31 పరుగులు జోడించారు. వీరి నిష్క్రమణ తర్వాత సాయి సుదర్శన్‌, ఒమర్జాయ్‌ (17) మూడో వికెట్‌కు 40 పరుగులు జత చేర్చారు. 17వ ఓవర్‌లో మిల్లర్‌ (12), సాయిని బుమ్రా అవుట్‌ చేశాడు. అయితే రాహుల్‌ తెవాటియా 18వ ఓవర్‌లో 6,4,4తో 19 రన్స్‌ అందించడంతో జట్టు స్కోరు 150 దాటగలిగింది. కానీ ఆఖరి ఓవర్‌లో కొట్జీ.. తెవాటియా వికెట్‌తో 7 పరుగులే ఇచ్చాడు.

స్కోరుబోర్డు

గుజరాత్‌: సాహా (బి) బుమ్రా 19, గిల్‌ (సి) రోహిత్‌ (బి) చావ్లా 31, సుదర్శన్‌ (సి) తిలక్‌ (బి) బుమ్రా 45, ఒమర్జాయ్‌ (సి) తిలక్‌ (బి) కొట్జీ 17, మిల్లర్‌ (సి) హార్దిక్‌ (బి) బుమ్రా 12, విజయ్‌ శంకర్‌ (నాటౌట్‌) 6, తెవాటియా (సి) నమన్‌ (బి) కొట్జీ 22, రషీద్‌ (నాటౌట్‌) 4, ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 20 ఓవర్లలో 168/6; వికెట్ల పతనం: 1-31, 2-64, 3-104, 4-133, 5-134, 6-161; బౌలింగ్‌: హార్దిక్‌ 3-0-30-0, ల్యూక్‌ 2-0-25-0, బుమ్రా 4-0-14-3, ములానీ 3-0-24-0, పియూష్‌ చావ్లా 3-0-31-1, నమన్‌ ధిర్‌ 1-0-13-0, కొట్జీ 4-0-27-2.

ముంబై: ఇషాన్‌ (సి) సాహా (బి) ఒమర్జాయ్‌ 0, రోహిత్‌ (ఎల్బీ) కిషోర్‌ 43, నమన్‌ (ఎల్బీ) ఒమర్జాయ్‌ 20, బ్రెవిస్‌ (సి అండ్‌ బి) మోహిత్‌ 46, తిలక్‌ వర్మ (సి/సబ్‌) మనోహర్‌ (బి) జాన్సన్‌ 25, టిమ్‌ డేవిడ్‌ (సి) మిల్లర్‌ (బి) మోహిత్‌ 11, హార్దిక్‌ (సి) తెవాటియా (బి) ఉమేశ్‌ 11, కొట్జీ (సి అండ్‌ బి) జాన్సన్‌ 1, ములానీ (నాటౌట్‌)1, పియూష్‌ (సి) రషీద్‌ (బి) ఉమేశ్‌ 0, బుమ్రా (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 20 ఓవర్లలో 162/9; వికెట్ల పతనం: 1-0, 2-30, 3-107, 4-129, 5-142, 6-148, 7-150, 8-160, 9-160; బౌలింగ్‌: ఒమర్జాయ్‌ 3-0-27-2, ఉమేశ్‌ యాదవ్‌ 3-0-31-2, రషీద్‌ ఖాన్‌ 4-0-23-0, సాయి కిషోర్‌ 4-0-24-1, జాన్సన్‌ 2-0-25-2, మోహిత్‌ శర్మ 4-0-32-2.

Updated Date - Mar 25 , 2024 | 04:53 AM

Advertising
Advertising