ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నడాల్‌.. భావోద్వేగ వీడ్కోలు

ABN, Publish Date - Nov 21 , 2024 | 06:09 AM

టెన్నిస్‌ దిగ్గజం రఫెల్‌ నడాల్‌ (38) సొంత ప్రేక్షకుల మధ్య సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. డేవిస్‌ కప్‌ క్వార్టర్స్‌లో స్పెయిన్‌ 1-2తో నెదర్లాండ్స్‌ చేతిలో ఓడింది. దీంతో

డేవిస్‌క్‌పలో స్పెయిన్‌ ఓటమితో ముగిసిన కెరీర్‌

మలగ (స్పెయిన్‌): టెన్నిస్‌ దిగ్గజం రఫెల్‌ నడాల్‌ (38) సొంత ప్రేక్షకుల మధ్య సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. డేవిస్‌ కప్‌ క్వార్టర్స్‌లో స్పెయిన్‌ 1-2తో నెదర్లాండ్స్‌ చేతిలో ఓడింది. దీంతో నడాల్‌కు మరో మ్యాచ్‌ ఆడే అవకాశం దక్కలేదు. తొలి మ్యాచ్‌లో నడాల్‌ 4-6, 4-6తో బోటిక్‌ వాన్‌ డి జాండ్‌షుల్ప్‌ చేతిలో పోరాడి ఓడాడు. డేవిస్‌ కప్‌తో కెరీర్‌కు వీడ్కోలు పలుకుతానని రఫా ముందుగానే ప్రకటించాడు. జట్టు కూడా పరాజయంపాలు కావడంతో.. నడాల్‌ ప్రయాణం ముగిసింది. మ్యాచ్‌ తర్వాత జరిగిన సన్మాన కార్యక్రమంలో రఫా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకొంటూ.. అభిమానులను ఉత్తేజపరిచే ప్రయత్నం చేశాడు. అతడు సాధించిన ఘనతలతోపాటు ప్రముఖుల శుభాకాంక్షలతో కూడిన వీడియోను ప్లే చేస్తున్నంత సేపు.. స్టేడియం మొత్తం ‘రా..రా.. ఫా.. ఫా’ అంటూ మార్మోగిపోయింది. కెరీర్‌లో నడాల్‌ 22 గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గగా.. అందులో 14 ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిళ్లే కావడం విశేషం. మట్టికోర్టులో తనకు ఎదురులేదని నిరూపించాడు. కానీ, గాయాలు దెబ్బతీయడంతో పుంజుకోలేకపోయాడు.

Updated Date - Nov 21 , 2024 | 06:09 AM