ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

20ఏళ్ల తర్వాత..

ABN, Publish Date - Jul 08 , 2024 | 06:20 AM

సుదీర్ఘ నిరీక్షణకు నెదర్లాండ్స్‌ తెరదించింది. రెండు దశాబ్దాల తర్వాత యూరోపియన్‌ చాంపియన్‌షి్‌పలో సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. శనివారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్స్‌ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ 2-1తో తుర్కియేను ఓడించింది. 2004 తర్వాత తొలిసారి ఫైనల్‌ ఫోర్‌లోకి అడుగుపెట్టింది.

యూరో సెమీ్‌సకు నెదర్లాండ్స్‌

2-1తో తుర్కియేపై గెలుపు

బెర్లిన్‌: సుదీర్ఘ నిరీక్షణకు నెదర్లాండ్స్‌ తెరదించింది. రెండు దశాబ్దాల తర్వాత యూరోపియన్‌ చాంపియన్‌షి్‌పలో సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. శనివారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్స్‌ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ 2-1తో తుర్కియేను ఓడించింది. 2004 తర్వాత తొలిసారి ఫైనల్‌ ఫోర్‌లోకి అడుగుపెట్టింది. తుర్కియే కూడా అద్భుత పోరాటాన్ని ప్రదర్శించింది. 35వ నిమిషంలోనే సమేట్‌ అకాడిన్‌ హెడర్‌ ద్వారా గోల్‌ చేసి తుర్కియేను 1-0 ఆధిక్యంలో నిలిపాడు. దీంతో కంగుతున్న డచ్‌ టీమ్‌ కౌంటర్‌ ఎటాక్‌ చేసినా ప్రత్యర్థి సమర్థంగా అడ్డుకోవడంతో ఫస్టా్‌ఫలో గోల్‌ చేయలేకపోయింది. అయితే, సెకండా్‌ఫలో ఆరున్నర అడుగుల పొడుగున్న స్ట్రయికర్‌ వవౌట్‌ విగోస్ట్‌ సబ్‌స్టిట్యూట్‌గా ఎంట్రీ ఇవ్వడంతో ఆరెంజ్‌ ఆర్మీ మరింత దూకుడుగా దాడులు చేస్తూ తుర్కియేను ఆత్మరక్షణలో నెట్టింది. ఈ క్రమంలో 70వ నిమిషంలో డిపే ఇచ్చిన క్రాస్‌ను అందుకున్న స్టీఫెన్‌ డి వ్రిజ్‌ హెడర్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపడంతో నెదర్లాండ్స్‌ 1-1తో స్కోరు సమం చేసింది. 6 నిమిషాల తర్వాత ఆరెంజ్‌ ఆర్మీ మరో దాడిలో బంతిని అడ్డుకొనే క్రమంలో తుర్కియే ఆటగాడు మెర్ట్‌ ముల్డర్‌ కాలికి తగిలిన బంతి నేరుగా గోల్‌లోకి వెళ్లింది. ఇలా తుర్కియే ప్లేయర్‌ ముల్డర్‌ ఓన్‌ గోల్‌తో 2-1 ఆధిక్యం సాధించిన నెదర్లాండ్స్‌.. ఆ తర్వాత ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను సొంతం చేసుకొంది.

Updated Date - Jul 08 , 2024 | 06:20 AM

Advertising
Advertising
<