నితీశ్ తుఫాన్
ABN, Publish Date - Oct 10 , 2024 | 05:24 AM
తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి (34 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 76) తుఫాన్ ఇన్నింగ్స్‌కు రింకూ సింగ్ (29 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్స్‌లతో 53) మెరుపు హాఫ్ సెంచరీ తోడైన వేళ బంగ్లాదేశ్‌తో రెండో టీ20లో...
86 పరుగులతో బంగ్లా ఓటమి
భారత్‌దే సిరీస్
న్యూఢిల్లీ: తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి (34 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 76) తుఫాన్ ఇన్నింగ్స్‌కు రింకూ సింగ్ (29 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్స్‌లతో 53) మెరుపు హాఫ్ సెంచరీ తోడైన వేళ బంగ్లాదేశ్‌తో రెండో టీ20లో టీమిండియా 86 రన్స్‌తో ఏకపక్ష విజ యం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీ్‌సను మరో టీ20 ఉండగానే సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత భారత్ 20 ఓవర్లలో 221/9 స్కోరు చేసింది. హార్దిక్ పాండ్యా (19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 32) మరోసారి దూకుడు ప్రదర్శించాడు. రిషద్ 3, టస్కిన్, ముస్తాఫిజుర్, తన్జిమ్ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు. ఛేదనలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 135/9 స్కోరుకే పరిమితమైంది. మహ్ముదుల్లా (41) ఒక్కడే రాణించాడు. వరుణ్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నితీశ్ చెరో రెండు వికెట్లు తీశారు.
బంగ్లా విల..విల..: భారీ స్కోరు ఛేదనలో భారత బౌలర్ల ధాటికి మహ్ముదుల్లా మినహా ఏ ఒక్క బంగ్లా బ్యాటరూ ఎదురు నిలవలేకపోయారు. పర్వేజ్‌ను బౌల్డ్ చేయడం ద్వారా బంగ్లా పతనానికి అర్ష్‌దీప్ నాంది పలకగా..అనంతరం ఒక్కో భారత బౌలర్ ప్రత్యర్థి బ్యాటర్లను వరుసగా పెవిలియన్‌కు చేర్చారు.
నితీశ్ ఆకాశమే హద్దుగా.. : భారత ఇన్నింగ్స్‌లో ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ ఆటే హైలైట్. పవర్ ప్లేలోనే టాప్-3 బ్యాటర్లు అవుటైన దశలో ఏమాత్రం ఒత్తిడి లేకుండా బంగ్లాదేశ్ బౌలర్లను ఆడేసుకున్నాడు. కీపర్ లిట్టన్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన నితీశ్ ఆపై ప్రత్యర్థి బౌలర్ల భరతం పట్టాడు. రింకూసింగ్‌తో కలిసి భారత స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. స్పిన్నర్ రిషద్ వేసిన పదో ఓవర్లో నితీశ్ 4,6,6,6తో కదం తొక్కడంతో మొత్తం 24 రన్స్ లభించాయి. ఇదే ఊపులో టస్కిన్ ఓవర్లో బౌండరీ ఆపై సింగిల్‌తో నితీశ్ రెండో టీ20లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇక మెహ్దీహసన్ వేసిన 13వ ఓవర్లో నితీశ్ 6,4,6,6తో విరుచుకుపడడంతో స్టేడియం యావత్తూ ఫ్యాన్స్ హోరుతో దద్దరిల్లింది. అయితే తదుపరి ఓవర్లో నితీశ్‌ను క్యాచవుట్ చేసిన ముస్తాఫిజుర్ బంగ్లాదేశ్‌కు అతిపెద్ద రిలీఫ్ ఇచ్చాడు. దాంతో 109 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. కానీ రింకూకు తోడైన హార్దిక్ ఎడాపెడా షాట్లతో బంగ్లా బౌలర్లను బెంబేలెత్తించాడు. మరోవైపు తన్జిమ్ బౌలింగ్‌లో 4,4,6తో రింకూ అర్ధ శతకం సాధించాడు. రింకూ ఇన్నింగ్స్‌కు టస్కిన్ తెరదించగా..తదుపరి పరాగ్ కూడా భారీ షాట్లతో చెలరేగాడు.
స్కోరుబోర్డు
భారత్ : శాంసన్ (సి) షంటో (బి) టస్కిన్ 10, అభిషేక్ శర్మ (బి) తన్జిమ్ 15, సూర్యకుమార్ (సి) షంటో (బి) ముస్తాఫిజుర్ 8, నితీశ్ (సి) మెహ్దీహసన్ (బి) ముస్తాఫిజుర్ 74, రింకూ సింగ్ (సి) జాకెర్ (బి) టస్కిన్ 53, హార్దిక్ (సి) మెహ్దీహసన్ (బి) రిషద్ 32, పరాగ్ (సి) మహ్ముదుల్లా (బి) తన్జిమ్ 15, సుందర్ (నాటౌట్) 0, వరుణ్ (సి) పర్వేజ్ (బి) రిషద్ 0, అర్ష్‌దీప్ (సి) లిట్టన్ (బి) రిషద్ 6, మయాంక్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు : 7 ; మొత్తం 20 ఓవర్లలో 221/9 ; వికెట్లపతనం : 1-17, 2-25, 3-41, 4-149, 5-185, 6-213, 7-214, 8-214, 9-220; బౌలింగ్: మెహ్దీహసన్ 3-0-46-0, టస్కిన్ 4-0-16-2, తన్జిమ్ 4-0-50-2, ముస్తాఫిజుర్ 4-0-36-2, రిషద్ 4-0-55-3, మహ్ముదుల్లా 1-0-15-0.
బంగ్లాదేశ్: పర్వేజ్ (బి) అర్ష్‌దీప్ 16, లిట్టన్ (బి) వరుణ్ 14, షంటో (సి) హార్దిక్ (బి) సుందర్ 11, తౌహిద్ (బి) అభిషేక్ 2, మెహ్దీహసన్ (సి) సబ్/బిష్ణోయ్ (బి) పరాగ్ 16, మహ్ముదుల్లా (సి) రియాన్ (బి) నితీశ్ 41, జాకెర్ (సి) సుందర్ (బి) మయాంక్ 1, రిషద్ (సి) హార్దిక్ (బి) వరుణ్ 9, తన్జిమ్ (సి) హార్దిక్ (బి) నితీశ్ 8, టస్కిన్ (నాటౌట్) 5, ముస్తాఫిజుర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం 20 ఓవర్లలో 135/9; వికెట్లపతనం: 1-20, 2-40, 3-42, 4-46, 5-80, 6-83, 7-93, 8-120, 9-127; బౌలింగ్: అర్ష్‌దీప్3-0-26-1, నితీశ్4-0-23-2, సుందర్ 1-0-4-1, వరుణ్ 4-0-19-2, అభిషేక్ 2-0-10-1, మయాంక్ 4-0-30-1, రియాన్ 2-0-16-1.
టీ20లలో బంగ్లాపై భారత్‌కిది (86 పరుగులు) అతి పెద్ద విజయం
ఓ మ్యాచ్‌లో భారత బౌలర్లు ఏడుగురు వికెట్లు తీయడం ఇదే తొలిసారి.
ఒకే టీ20లో 70+ పరుగులు, 2 వికెట్లు సాధించిన తొలి భారత ఆటగాడు నితీశ్
Updated Date - Oct 10 , 2024 | 05:24 AM