Virender Sehwag: టీమిండియాలో నాణ్యమైన స్పిన్నర్ లేడు.. స్పిన్ ఆడగలిగే బ్యాటర్లు లేరు.. సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Sep 06 , 2024 | 09:06 PM
మైదానంలో తన డాషింగ్ బ్యాటింగ్‌తో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన వీరేంద్ర సెహ్వాగ్ రిటైర్మెంట్ తర్వాత కూడా తన ధాటిని కొనసాగిస్తున్నాడు. తన మనసులో ఉన్నది సూటిగా, సుత్తి లేకుండా చెబుతుంటాడు. అప్పుడప్పుడు అవి వివాదాస్పదంగా మారుతుంటాయి.
మైదానంలో తన డాషింగ్ బ్యాటింగ్‌తో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) రిటైర్మెంట్ తర్వాత కూడా తన ధాటిని కొనసాగిస్తున్నాడు. తన మనసులో ఉన్నది సూటిగా, సుత్తి లేకుండా చెబుతుంటాడు. అప్పుడప్పుడు అవి వివాదాస్పదంగా మారుతుంటాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సెహ్వాగ్ స్పిన్ బౌలింగ్ (Spin Bowling) గురించి మాట్లాడాడు. టీమిండియా (TeamIndia)లో ప్రస్తుతం నాణ్యమైన స్పిన్నర్లు (Quality Spinners) లేరని అన్నాడు. అలాగే స్పిన్ బౌలింగ్‌లో సాధికారికంగా ఆడగలిగే బ్యాటర్లు కూడా లేరని వ్యాఖ్యానించాడు. సెహ్వాగ్ కామెంట్స్ క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి.
``ప్రస్తుతం టీమిండియాకు నాణ్యమైన స్పిన్నర్లు లేరు. ఒకప్పుడు అత్యుత్తమ స్పిన్నర్లను అందించిన భారత్ ఇప్పుడు ఆ విషయంలో వెనుకబడింది. దానికి ప్రధానం కారణం టెస్ట్ క్రికెట్‌కు దూరంగా జరగడమే. టీ20ల్లో స్పిన్నర్లు బంతిని ఫ్లైట్ చేసి విసరడానికి భయపడతారు. అలా వేస్తే బ్యాటర్లు భారీ షాట్‌లు ఆడేందుకు వీలు దొరుకుతుంది. అందువల్ల స్పిన్నర్లు టీ20ల్లో వైవిధ్యంగా బౌలింగ్ చేయడానికి సిద్ధపడడం లేదు. పైగా, ఇటీవలి కాలంలో దేశవాళీ క్రికెట్ కూడా పరిమిత ఓవర్ల వైపే దృష్టి సారిస్తోంద``ని సెహ్వాగ్ అన్నాడు.
``స్పిన్ బౌలింగ్‌ను ఇప్పటి బ్యాటర్లు సాధికారికంగా ఆడలేకపోతున్నారు. దానికి కారణం దేశవాళీ క్రికెట్ ఆడకపోవడమే. స్పిన్ బౌలింగ్‌లో ఆడడం నేర్చుకోవాలంటే దేశవాళీ టెస్ట్ మ్యాచ్‌లు ఆడాలి. మా కాలంలో సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, నేను, యువరాజ్.. అందరం డొమస్టిక్ క్రికెట్ ఆడేవాళ్లం. టెస్ట్‌లు ఆడితే స్పిన్ బౌలింగ్‌నే ఎక్కువగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం క్రికెటర్లకు అంతర్జాతీయ బిజీ షెడ్యూల్స్ వల్ల దేశవాళీ క్రికెట్ ఆడే అవకాశం దొరకడం లేదు`` అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
ఇవి కూడా చదవండి..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Sep 06 , 2024 | 09:06 PM