షఫాలీపై వేటు
ABN, Publish Date - Nov 20 , 2024 | 02:43 AM
ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగే మూడు వన్డేల సిరీ్‌సకు భారత జట్టును ప్రకటించారు. వచ్చే నెల 5 నుంచి 11 వరకు బ్రిస్బేన్, పెర్త్‌లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. అయితే 16 మందితో కూడిన ఈ జాబితాలో...
ఆసీ్‌సతో వన్డే సిరీ్‌సకు భారత మహిళల జట్టు
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగే మూడు వన్డేల సిరీ్‌సకు భారత జట్టును ప్రకటించారు. వచ్చే నెల 5 నుంచి 11 వరకు బ్రిస్బేన్, పెర్త్‌లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. అయితే 16 మందితో కూడిన ఈ జాబితాలో డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మకు చోటు దక్కలేదు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల్లో తను కేవలం 56 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ ఫార్మాట్‌లో ఆమె దాదాపు రెండున్నరేళ్ల క్రితం చివరి అర్ధసెంచరీ సాధించడం గమనార్హం. ఇక గాయం నుంచి కోలుకున్న హర్లీన్ డియోల్‌కు చోటు కల్పించగా, పరీక్షల కారణంగా కివీస్‌తో సిరీ్‌సకు దూరమైన రిచా ఘోష్ జట్టులోకి వచ్చింది. అలాగే ఆఫ్ స్పిన్నర్ మిన్ను మణికి తొలిసారి వన్డేల్లో బెర్త్ దక్కింది.
జట్టు:
హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన, ప్రియా పూనియా, జెమీమా, హర్లీన్, యాస్తిక, రిచా ఘోష్, తేజల్, దీప్తి శర్మ, మిన్ను మణి, ప్రియా మిశ్రా, రాధా యాదవ్, టిటాస్ సాధు, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, సైమా ఠాకూర్.
Updated Date - Nov 20 , 2024 | 02:43 AM