ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Novak Djokovic : పతకం దిశగా జొకోవిచ్‌

ABN, Publish Date - Aug 01 , 2024 | 12:43 AM

ప్రపంచ టెన్నిస్‌ స్టార్‌ ఆటగాడు నొవాక్‌ జొకోవిచ్‌ పారిస్‌ ఒలింపిక్స్‌లో పతకం దిశగా దూసుకెళుతున్నాడు. ఈ సెర్బియా కింగ్‌ పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్‌ఫైనల్‌

Novak Djokovic

ప్రపంచ టెన్నిస్‌ స్టార్‌ ఆటగాడు నొవాక్‌ జొకోవిచ్‌ పారిస్‌ ఒలింపిక్స్‌లో పతకం దిశగా దూసుకెళుతున్నాడు. ఈ సెర్బియా కింగ్‌ పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్‌ఫైనల్‌ చేరాడు. బుధవారం జరిగిన ప్రీక్వార్టర్‌ఫైనల్స్‌ పోరులో జొకోవిచ్‌ 7-5, 6-3తో జర్మనీకి చెందిన డొమినిక్‌ కోఫెర్‌ను వరుససెట్లలో ఓడించాడు. ఇప్పటికే 24 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో పాటు పలుమార్లు వరల్డ్‌ నెంబర్‌వన్‌ ర్యాంక్‌ను కూడా అందుకున్న 37 ఏళ్ల జొకోవిచ్‌ ఖాతాలో ఒలింపిక్స్‌ స్వర్ణ పతకం మాత్రం లేదు. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో అతను కాంస్యం గెలిచాడు. కాగా, ఒలింపిక్స్‌లో క్వార్టర్స్‌ చేరడం జొకోవిచ్‌కు ఇది నాలుగోసారి. దీంతో విశ్వక్రీడల్లో టెన్ని్‌సను తిరిగి ప్రవేశపెట్టిన (1988) తర్వాత అత్యధికసార్లు క్వార్టర్స్‌ చేరిన ఆటగాడిగా జొకో రికార్డుకెక్కాడు.

Updated Date - Aug 01 , 2024 | 12:43 AM

Advertising
Advertising
<