ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ODI series : ఇక సీనియర్ల వంతు

ABN, Publish Date - Aug 02 , 2024 | 04:27 AM

టీ20 వరల్డ్‌క్‌పలో చాంపియన్‌గా నిలిచిన వెంటనే టీమిండియా జింబాబ్వే, శ్రీలంకలపై సిరీ్‌సలు గెలుచుకుంది. ఇప్పుడు ఈ ఏడాది తొలిసారిగా వన్డేలు ఆడబోతోంది. మూడు మ్యాచ్‌ల సిరీ్‌సలో భాగంగా శుక్రవారం ఆతిథ్య

నేటి నుంచి శ్రీలంకతో వన్డే సిరీస్‌

బరిలోకి రోహిత్‌, విరాట్‌, రాహుల్‌

మధ్యాహ్నం 2.30 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో

కొలంబో: టీ20 వరల్డ్‌క్‌పలో చాంపియన్‌గా నిలిచిన వెంటనే టీమిండియా జింబాబ్వే, శ్రీలంకలపై సిరీ్‌సలు గెలుచుకుంది. ఇప్పుడు ఈ ఏడాది తొలిసారిగా వన్డేలు ఆడబోతోంది. మూడు మ్యాచ్‌ల సిరీ్‌సలో భాగంగా శుక్రవారం ఆతిథ్య శ్రీలంకతో మొదటి మ్యాచ్‌ జరుగనుంది. కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ పగ్గాలు తీసుకోవడంతో పాటు స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ కూడా జట్టులో చేరాడు. అలాగే చాలాకాలం తర్వాత కేఎల్‌ రాహుల్‌ కనిపించనున్నాడు. హార్దిక్‌, బుమ్రా, జడేజాలకు విశ్రాంతినిచ్చారు. 2023 వన్డే వరల్డ్‌కప్‌ నుంచి ఇప్పటివరకు భారత్‌ కేవలం మూడు వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడింది. మరో ఆరు నెలల్లో చాంపియన్స్‌ ట్రోఫీ జరగాల్సి ఉండగా.. లంకతో సిరీ్‌సను సన్నాహకంగా భావించాలనుకుంటోంది. అలాగే వికెట్‌ కీపర్‌గా ఎవరిని ఆడించాలనేది కూడా తేలాల్సి ఉంది. పంత్‌ గైర్హాజరీలో ఈ బాధ్యతలు రాహుల్‌ తీసుకున్నాడు. అయితే రెండేళ్లుగా పంత్‌ వన్డేలు ఆడలేదు. కానీ టాప్‌-6 బ్యాటర్లలో ఒక్క లెఫ్ట్‌ హ్యాండర్‌ కూడా లేకపోవడం పంత్‌కు కలిసివచ్చే విషయం. మున్ముందు రాహుల్‌ లేదా పంత్‌లలో ఒకరివైపు మొగ్గు చూపేందుకు ఈ మ్యాచ్‌లు ఉపయోగపడగలవు. అలాగే తొలిసారి గంభీర్‌ శిక్షణలో జట్టు టీ20 సిరీ్‌సను క్లీన్‌స్వీ్‌ప చేయగా.. ఇప్పుడు సీనియర్ల నుంచి తను ఎలాంటి ప్రదర్శన రాబట్టగలడో వేచిచూడాల్సిందే. మరోవైపు ఆరుగురు పేసర్లు గాయంతో దూరం కావడంతో శ్రీలంక బౌలింగ్‌ బలహీనంగా మారింది. ఈస్థితిలో స్టార్లతో కూడిన భారత్‌కు ఆతిథ్య జట్టు ఏమేరకు పోటీనివ్వగలదనేది ఆసక్తికరంగా మారింది.

తుది జట్లు (అంచనా): భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయాస్‌ అయ్యర్‌, రాహుల్‌/పంత్‌, దూబే/పరాగ్‌, అక్షర్‌, హర్షిత్‌, కుల్దీప్‌, సిరాజ్‌, ఖలీల్‌/అర్ష్‌దీప్‌.

శ్రీలంక: నిస్సాంక, ఫెర్నాండో, కుశాల్‌ మెండిస్‌, సమరవిక్రమ, అసలంక (కెప్టెన్‌), లియనగె, హసరంగ, కరుణరత్నె, వెల్లలగె, తీక్షణ, ఫెర్నాండో.

Updated Date - Aug 02 , 2024 | 04:27 AM

Advertising
Advertising
<