12 ఏళ్ల క్రితం పోటీపడింది.. ఇప్పుడు పతకం సొంతమైంది
ABN, Publish Date - Sep 28 , 2024 | 05:40 AM
అదృష్టం అంటే ఇదేనేమో! అప్పుడెప్పుడో 12 ఏళ్ల క్రితం ఒలింపిక్స్‌లో పోటీపడింది. కానీ, ఆనాడు కనీసం పోడియం ఫినిష్ కూడా చేయలేకపోయింది. కానీ, ఆ విశ్వక్రీడల్లో పాల్గొన్నందుకు ఇప్పుడు పతకం ఆమె సొంతమైంది. ఎలాగంటే... అమెరికాకు చెందిన ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ షనోన్
లండన్: అదృష్టం అంటే ఇదేనేమో! అప్పుడెప్పుడో 12 ఏళ్ల క్రితం ఒలింపిక్స్‌లో పోటీపడింది. కానీ, ఆనాడు కనీసం పోడియం ఫినిష్ కూడా చేయలేకపోయింది. కానీ, ఆ విశ్వక్రీడల్లో పాల్గొన్నందుకు ఇప్పుడు పతకం ఆమె సొంతమైంది. ఎలాగంటే... అమెరికాకు చెందిన ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ షనోన్ రోబురీ పన్నెండేళ్ల క్రితం 2012 లండన్ ఒలింపిక్స్‌లో 1500 మీటర్ల రేసులో పోటీపడింది. ఆ ఈవెంట్‌లో ఆమె ఆరోస్థానంలో నిలిచింది. అయితే, ఆ ఒలింపిక్స్ సందర్భంగా చేసిన డోప్ పరీక్షల్లో.. ఆ రేసులో పోటీపడ్డ మొత్తం 13 రన్నర్లలో ఐదుగురు డోపీలుగా తేలారు. వీరిలో స్వర్ణం, రజతం నెగ్గిన టర్కీ అథ్లెట్లు అస్లీ కాకిర్ అల్ఫ్‌టెకిన్, గేమ్జ్ బులుట్ ఉన్నారు. అప్పట్లో వీరిద్దరి నిష్క్రమణతో మూడోస్థానంలో నిలిచిన రష్యా రన్నర్ తాత్యానా తొమషోవా పతకం రజతానికి అప్‌గ్రేడ్ అయింది. అయితే, మరోసారి శాంపిల్స్ పున:పరీక్షలు, విచారణ అనంతరం తాజాగా తాత్యానా కూడా డోపీగా రుజువైంది. దీంతో నిన్నటిదాకా నాలుగో స్థానానికి అప్‌గ్రేడ్ అయిన 40 ఏళ్ల షనోన్.. ఇప్పుడు మూడోస్థానంతో కాంస్య పతకధారిగా నిలిచింది.
Updated Date - Sep 28 , 2024 | 05:40 AM