ఒకే వేదికపై అప్పుడూ.. ఇప్పుడూ!
ABN, Publish Date - Oct 20 , 2024 | 01:52 AM
సర్ఫరాజ్ కీలక సమయంలో సెంచరీతో జట్టును ఆదుకొన్నాడు. వంద మార్క్ చేరిన అనంతరం అతడు మైదానంలో జోష్‌తో సంబరాలు చేసుకొన్నాడు. అతడి సెలెబ్రేషన్స్ చూసి కెప్టెన్ రోహిత్‌తో పాటు కోహ్లీ నవ్వుకున్నారు...
సర్ఫరాజ్ కీలక సమయంలో సెంచరీతో జట్టును ఆదుకొన్నాడు. వంద మార్క్ చేరిన అనంతరం అతడు మైదానంలో జోష్‌తో సంబరాలు చేసుకొన్నాడు. అతడి సెలెబ్రేషన్స్ చూసి కెప్టెన్ రోహిత్‌తో పాటు కోహ్లీ నవ్వుకున్నారు. కాగా.. ఈ సందర్భంగా కోహ్లీ, సర్ఫరాజ్ ఒకే వేదికపై పంచుకొన్న ఆనందాలను బీసీసీఐ ఎక్స్‌లో పోస్టు చేసింది. 2015లో రాజస్థాన్‌తో ఐపీఎల్ మ్యాచ్‌లో బెంగళూరు తరఫున 17 ఏళ్ల సర్ఫరాజ్ 21 బంతుల్లో 45 పరుగులు చేయడంతో జట్టు స్కోరు 200 మార్క్ అందుకొంది. ఆ సమయం లో సర్ఫరాజ్ డగౌట్‌కు వస్తున్నప్పుడు కోహ్లీ ‘దండం’ పెట్టి ప్రశంసించాడు. ఇప్పుడు అదే మైదానంలో టీమిండియా తరఫున సర్ఫరాజ్ సెంచరీ సాధిస్తే.. కోహ్లీ నవ్వుతూ అతడిని ప్రోత్సహించాడు.
Updated Date - Oct 20 , 2024 | 01:52 AM