ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పంత్‌పై ఓ మ్యాచ్‌ సస్పెన్షన్‌

ABN, Publish Date - May 12 , 2024 | 02:13 AM

ప్లేఆఫ్స్‌ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవాల్సిన క్లిష్ట పరిస్థితుల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్‌ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌పై భారీ జరిమానాతోపాటు ఓ మ్యాచ్‌ సస్పెన్షన్‌ను విధించారు...

న్యూఢిల్లీ: ప్లేఆఫ్స్‌ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవాల్సిన క్లిష్ట పరిస్థితుల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్‌ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌పై భారీ జరిమానాతోపాటు ఓ మ్యాచ్‌ సస్పెన్షన్‌ను విధించారు. డీసీ జట్టు ఇప్పటికే రెండుసార్లు స్లో ఓవర్‌ రేట్‌కు పాల్పడగా, గత మంగళవారం రాజస్థాన్‌పై కూడా పునరావృతమైంది. దీంతో ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు పంత్‌కు రూ.30 లక్షల జరిమానాతో పాటు ఓ మ్యాచ్‌ నిషేధం విధించారు. అలాగే ఇతర ఆటగాళ్లు కూడా రూ.12 లక్షలు లేదా మ్యాచ్‌ ఫీజులో 50శాతం.. వీటిలో ఏది తక్కువైతే దానిని ఫైన్‌గా కట్టాల్సి ఉంటుందని పాలకమండలి వెల్లడించింది. మరోవైపు ఢిల్లీ జట్టు మ్యాచ్‌ రెఫరీ నిర్ణయాన్ని సవాల్‌ చేసినా ఫలితం లేకపోయింది. కాగా ఆదివారం బెంగళూరు జట్టుతో జరిగే మ్యాచ్‌కు పంత్‌ స్థానంలో అక్షర్‌ పటేల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు.

Updated Date - May 12 , 2024 | 02:13 AM

Advertising
Advertising