ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pakistan: పాకిస్తాన్‌కు మరో ఎదురు దెబ్బ.. డబ్ల్యూటీసీలో ఆరు పాయింట్లు కోత.. బంగ్లాకూ ఫైన్!

ABN, Publish Date - Aug 26 , 2024 | 07:44 PM

స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఓడి షాక్ తిన్న పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌కు ఐసీసీ మరో ఝలక్ ఇచ్చింది. రావల్పండి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదైంది. దీంతో ఐసీసీ కొరడా ఝుళిపించింది. ఇరు జట్లకూ ఫైన్ విధించింది.

Pak vs Ban Test

పాకిస్తాన్ క్రికెట్‌ జట్టుకు (Pakistan Cricket Team) దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఓడి షాక్ తిన్న పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌కు ఐసీసీ (ICc) మరో ఝలక్ ఇచ్చింది. రావల్పండి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ (Slow overrate) నమోదైంది. దీంతో ఐసీసీ కొరడా ఝుళిపించింది. ఇరు జట్లకూ ఫైన్ (Fine) విధించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 23-25లో పాయింట్లను (WTC points) కట్ చేసింది. మ్యాచ్ జరిగిన రోజు నిర్ణీత సమయంలో పాకిస్తాన్ ఆరు ఓవర్లు తక్కువగా వేసింది (Pak vs Ban Test).


ఆరు ఓవర్లు తక్కువగా వేసినందుకు పాకిస్తాన్ డబ్ల్యూటీసీ పాయింట్ల ఖాతాలో ఆరు పాయింట్లను కట్ చేసింది. అలాగే ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించింది. అలాగే బంగ్లాదేశ్‌కు 15 శాతం జరిమానా విధించింది. బంగ్లాకు 3 డబ్ల్యూటీసీ పాయింట్లను కోత వేసింది. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో బంగ్లాదేశ్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానం నుంచి ఏడో స్థానానికి పడిపోయింది. పాకిస్తాన్ మరింత దిగజారి ఎనిమిదో స్థానానికి పడిపోయింది. బంగ్లాదేశ్‌కు స్లోఓవర్ రేట్ ఇదే మొదటి సారి కావడంతో తక్కువ ఫైన్ పడింది. పాకిస్తాన్ 2023 పెర్త్ టెస్ట్‌లో కూడా నిర్ణీత సమయంలో తక్కువ ఓవర్లు వేసింది.


ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 23-25లో పాకిస్తాన్‌కు ఇది రెండో తప్పిదం కావడంతో భారీ జరిమానా పడింది. ఇక, మ్యాచ్ సమయంలో పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌తో దురుసుగా ప్రవర్తించిన బంగ్లా ఆటగాడు షకీబ్ అల్ హసన్‌పై కూడా ఐసీసీ చర్యలు తీసుకుంది. అతడి మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది. కాగా, పాక్‌పై బంగ్లా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టెస్ట్‌ల్లో పాకిస్తాన్‌పై బంగ్లాకు ఇదే తొలి విజయం కావడం గమనార్హం.

ఇవి కూడా చదవండి:

బంగ్లా చారిత్రక విజయం


పారా హుషార్‌

వచ్చే జూన్‌ 20 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 26 , 2024 | 07:44 PM

Advertising
Advertising
<