ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Watch Video: గల్లీ క్రికెటర్లు కూడా ఈ క్యాచ్ వదిలేయరేమో.. పాకిస్తాన్ క్రికెటర్ల ఫీల్డింగ్‌పై నెట్టింట విమర్శలు..

ABN, Publish Date - Sep 01 , 2024 | 06:01 PM

పాకిస్తాన్ క్రికెట్ జట్టు రోజు రోజుకూ నాసిరకం ప్రదర్శనతో క్రికెట్ అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఏ విభాగంలోనూ అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనను కనబరచడం లేదు. ముఖ్యంగా ఫీల్డింగ్ విభాగంలో వారి ప్రదర్శన గల్లీ క్రికెటర్లను తలపిస్తోంది.

Pakistan fielders drops an easy catch

పాకిస్తాన్ క్రికెట్ జట్టు (Pakistan Cricket Team) రోజు రోజుకూ నాసిరకం ప్రదర్శనతో క్రికెట్ అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఏ విభాగంలోనూ అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనను కనబరచడం లేదు. ముఖ్యంగా ఫీల్డింగ్ (Pakistan fielding) విభాగంలో వారి ప్రదర్శన గల్లీ క్రికెటర్లను తలపిస్తోంది. ఇప్పటికే స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఓడిపోయిన పాకిస్తాన్ రెండో టెస్ట్‌లోనూ తమ తీరును మార్చుకోలేదు. తాజా టెస్ట్‌‌లో తొలి రోజు బంగ్లా ఓపెనర్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను పాక్ ఫీల్డర్లు వదిలేశారు (Pak vs Ban).


పాకిస్తాన్ ఆలౌట్ అయిన తర్వాత బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఓపెనర్ షాద్‌మన్ ఇస్లామ్ ఆరంభంలోనే ఔటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. తొలి ఓవర్ బౌలింగ్ చేసిన పాక్ బౌలర్ మీర్‌ హమ్జా ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు స్లిప్‌ ఫీల్డర్‌లతో పక్కగా ఫీల్డింగ్ సెట్ చేశాడు. ఫీల్డింగ్‌కు తగినట్టుగానే అద్భుతమైన అవుట్ స్వింగర్ వేశాడు. ఆ బంతి షాద్‌మన్ ఇస్లామ్ బ్యాట్‌కు తగిలి నేరుగా ఐదో స్లిప్ ఫీల్డర్ అయిన సౌద్ షకీల్ చేతుల్లోకి వెళ్లింది. అంత సులభమైన క్యాచ్‌ను షకీల్ జార విడిచాడు. ఆ తర్వాత ఆ బంతి నాలుగో స్లిప్ ఫీల్డర్ చేతుల నుంచి కూడా జారిపోయింది.


చివరకు అంత సులభమైన క్యాచ్‌ను ఇద్దరు పాక్ ఫీల్డర్లు పట్టుకోలేకపోయారు. దీంతో షాద్‌మన్ ఇస్లామ్ సున్నా పరుగల వద్దే అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ సయీమ్ అయూబ్ (58), షాన్ మసూద్ (57), అఘా సల్మాన్ (54) అర్ధశతకాలు సాధించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులకు ఆలౌట్ అయింది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 262 పరుగులకు ఆలౌటైంది. 26 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన బంగ్లాను లిట్టన్ దాస్ (138) సెంచరీతో ఆదుకున్నాడు. అతడికి హసన్ మిరాజ్ (78) సహకారం అందించాడు

ఇవి కూడా చదవండి..

భళా.. రుబీనా


Champions Trophy: టీమిండియాను పాకిస్తాన్‌కు పంపకూడదు.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!


Team India: భారత్-బంగ్లా టెస్ట్ మ్యాచుకు ముగ్గురు కీలక ఆటగాళ్లు దూరం?


Rahul Dravid:అండర్-19 జట్టులోకి సమిత

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 01 , 2024 | 06:01 PM

Advertising
Advertising