Pakistan: భారత్‌కు పాక్ బెదిరింపు.. వచ్చే ఏడాది పాకిస్తాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా వెళ్లకపోతే జరిగేది అదేనట..!
ABN, Publish Date - Jul 15 , 2024 | 10:48 AM
ఓ క్రికెట్ మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ (Ind vs Pak) తలపడుతున్నాయంటే దానికుండే క్రేజే వేరు. అందులోనూ ఐసీసీ టోర్నీల్లో భారత్-పాక్ మ్యాచ్‌కు విపరీతమైన ఆదరణ ఉంటుంది. వచ్చే ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో (Champions Trophy 2025) మళ్లీ భారత్-పాక్ తలపడే అవకాశం ఉంది. ఈ టోర్నీని వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో పాకిస్తాన్ నిర్వహించనుంది.
ఓ క్రికెట్ మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ (Ind vs Pak) తలపడుతున్నాయంటే దానికుండే క్రేజే వేరు. అందులోనూ ఐసీసీ టోర్నీల్లో భారత్-పాక్ మ్యాచ్‌కు విపరీతమైన ఆదరణ ఉంటుంది. వచ్చే ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో (Champions Trophy 2025) మళ్లీ భారత్-పాక్ తలపడే అవకాశం ఉంది. ఈ టోర్నీని వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో పాకిస్తాన్ నిర్వహించనుంది. అయితే పాకిస్తాన్ (Pakistan)కు భారత క్రికెట్ జట్టును పంపేందుకు బీసీసీఐ (BCCI) సుముఖంగా లేదు. భారత్ ఆడే మ్యాచ్‌లను పాకిస్తాన్‌లో కాకుండా వేరే వేదికలపై నిర్వహించాలని ఐసీసీ (ICC)ని బీసీసీఐ కోరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌ల కోసం భారత జట్టు పాకిస్తాన్ రాకపోతే.. 2026లో భారత్, శ్రీలంక ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ నుంచి తాము పూర్తిగా తప్పుకుంటామని పీసీబీ (PCB) హెచ్చరించబోతోందట. ఈ మేరకు ఈ నెల 19-22 మధ్య కొలంబోలో జరిగే ఐసీసీ వార్షిక సమావేశంలో పీసీబీ ఈ విషయం తేల్చి చెప్పనుందట. పాకిస్తాన్, భారత్ ఓ క్రికెట్ మ్యాచ్‌లో తలపడితే కోట్ల కొద్దీ ఆదాయం సమకూరుతుంది.
2008 ముంబై దాడుల తర్వాతి నుంచి భారత జట్టు పాకిస్తాన్ పర్యటనలకు దూరంగా ఉంది. అప్పట్నుంచి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. ఐపీఎల్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లకు చోటు లేకుండా పోయింది. ఐసీసీ టోర్నీల్లో తప్ప భారత్, పాక్ జట్లు మ్యాచ్‌లు ఆడడం మానేశాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో సందిగ్ధత నెలకొంది. పాకిస్తాన్ వెళ్లకూడదని భారత్ అనుకుంటోంది. మొత్తం మ్యాచ్‌లన్నింటిని పాకిస్తాన్‌లోనే నిర్వహించాలని పీసీబీ పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..
Euro Cup 2024: యూరో కప్ 2024 ఫైనల్.. నాలుగోసారి గెలిచి చరిత్ర సృష్టించిన స్పెయిన్
Wimbledon 2024 final: వింబుల్డన్ విజేత కార్లోస్ అల్కరాస్.. ఫైనల్‌లో జకోవిచ్‌పై ఘనవిజయం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేేయండి..
Updated Date - Jul 15 , 2024 | 10:48 AM