Paris Olympics : తొలిరోజు భారత్ భళా
ABN, Publish Date - Jul 28 , 2024 | 06:25 AM
ఫేవరెట్‌గా బరిలోకి దిగిన సాత్విక్ జోడీ శుభారంభం చేసింది. గ్రూప్-సిలో జరిగిన బ్యాడ్మింటన్ డబుల్స్ తొలి మ్యాచ్‌లో మూడో సీడ్ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టి జంట 21-17, 21-14తో ఫ్రాన్స్‌కు చెందిన లూకాస్ కోర్వీ-రోనన్ లబార్‌పై వరుస గేముల్లో సునాయాసంగా
సాత్విక్ జోడీ, లక్ష్య ముందంజ
పారిస్: ఫేవరెట్‌గా బరిలోకి దిగిన సాత్విక్ జోడీ శుభారంభం చేసింది. గ్రూప్-సిలో జరిగిన బ్యాడ్మింటన్ డబుల్స్ తొలి మ్యాచ్‌లో మూడో సీడ్ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టి జంట 21-17, 21-14తో ఫ్రాన్స్‌కు చెందిన లూకాస్ కోర్వీ-రోనన్ లబార్‌పై వరుస గేముల్లో సునాయాసంగా గెలిచింది. సోమవారం జరిగే రెండో గ్రూప్ మ్యాచ్‌లో జర్మనీకి చెందిన మార్క్-మర్విన్‌తో సాత్విక్ జోడీ తలపడనుంది. తొలిసారి ఒలింపిక్స్ బరిలో దిగిన ఏస్ షట్లర్ లక్ష్య సేన్ బోణీ చేశాడు. పురుషుల సింగిల్స్ గ్రూప్-ఎల్‌లో జరిగిన మ్యాచ్‌లో సేన్ 21-8, 22-20తో టోక్యో సెమీఫైనలిస్ట్ కెవిన్ కార్డన్ (గ్వాటిమాల)పై వరుస గేముల్లో నెగ్గాడు. సోమవారం జరిగే రెండో గ్రూప్ మ్యాచ్‌లో జూలియన్ క్రెయిగ్ (బెల్జియం)తో సేన్ తలపడనున్నాడు. కాగా, మహిళల డబుల్స్ తొలిరౌండ్లో భారత జంట అశ్విని పొన్నప్ప-తనీషా 18-21, 10-21తో కొరియా ద్వయం కాంగ్-కిమ్ చేతిలో ఓటమిపాలైంది.
హర్మీత్ ముందంజ
టేబుల్ టెన్నిస్‌లో హర్మీత్ దేశాయ్ రెండో రౌండ్‌కు చేరుకొన్నాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో హర్మీత్ 4-0తో జైద్ అబూ యమన్ (జోర్డాన్)ను చిత్తు చేశాడు. .
బోపన్న పోరు నేటికి వాయిదా
రోహన్ బోపన్న-శ్రీరామ్ బాలాజీ పురుషుల టెన్నిస్ డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్ వర్షం కారణంగా ఆదివారానికి వాయిదా పడింది. ఫ్రాన్స్‌కు చెందిన మోన్‌ఫిల్స్-రోజర్ వస్సేలి జోడీతో బోపన్న ద్వయం తలపడనుంది.
టీటీ టెన్నిస్ రోయింగ్
రెపిచేజ్‌కు పన్వర్
రోయింగ్ పురుషుల సింగిల్ స్కల్ హీట్-1లో నాలుగో స్థానంలో నిలిచిన బల్‌రాజ్ పన్వర్ రెపిచేజ్‌కు అర్హత సాధించాడు. థామస్ మకింతోష్ (న్యూజిలాండ్), స్టెఫనోస్ ఎన్‌టౌస్‌కోస్ (గ్రీస్), అబ్దుల్‌ఖలేక్ ఎల్బనా (ఈజిప్ట్) తొలి మూడు స్థానాల్లో నిలిచి క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. రెపిచేజ్ ద్వారా పన్వర్.. సెమీస్ లేదా ఫైనల్‌కు చేరుకొనేందుకు రెండో అవకాశం దక్కుతుంది.
Updated Date - Jul 28 , 2024 | 06:25 AM