ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gymnastics : బంగారు బైల్స్‌

ABN, Publish Date - Aug 04 , 2024 | 06:49 AM

తనకు ఎదురేలేదని అమెరికా స్టార్‌ జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌ నిరూపించింది. పారిస్‌ ఒలింపిక్స్‌లో ఇప్పటికే మహిళల ఆర్టిస్టిక్‌ టీమ్‌, వ్యక్తిగత ఆల్‌రౌండ్‌ విభాగాల్లో పసిడి

సిమోన్‌ ఖాతాలో మూడో స్వర్ణం

మహిళల వాల్ట్‌ టైటిల్‌ కైవసం

పారిస్‌: తనకు ఎదురేలేదని అమెరికా స్టార్‌ జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌ నిరూపించింది. పారిస్‌ ఒలింపిక్స్‌లో ఇప్పటికే మహిళల ఆర్టిస్టిక్‌ టీమ్‌, వ్యక్తిగత ఆల్‌రౌండ్‌ విభాగాల్లో పసిడి పతకాలను సొంతం చేసుకున్న ఆమె..వాల్ట్‌లోనూ స్వర్ణం కొల్లగొట్టింది. తద్వారా ఈసారి విశ్వక్రీడల్లో స్వర్ణాల హ్యాట్రిక్‌ సాధించింది. వ్యక్తిగతంగా మాత్రం ఆమె రెండు పసిడి పతకాలు (ఆల్‌రౌండ్‌, వాల్ట్‌) అందుకుంది. కాగా..వెరా కస్లావ స్కా (చెక్‌ రిపబ్లిక్‌, 1964, 1968 ఒలింపిక్స్‌) తర్వాత విశ్వక్రీడల వాల్ట్‌ విభాగంలో రెండు స్వర్ణాలు దక్కించుకున్న తొలి జిమ్నా్‌స్టగా బైల్స్‌ రికార్డు నెలకొల్పింది. శనివారం జరిగిన వాల్ట్‌ ఫైనల్లో బైల్స్‌ 15.300 పాయింట్లతో స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. అండ్రాడే (బ్రెజిల్‌, 14.966) రజతం, కేరీ (అమెరికా, 14.466) కాంస్యం గెలిచారు.

‘బ్లాక్‌ జాబ్‌’ నాకిష్టం: ట్రంప్‌నకు బైల్స్‌ కౌంటర్‌

‘జిమ్నాస్టిక్స్‌లో స్వర్ణ పతకాలు గెలవడం నా బ్లాక్‌ జాబ్‌. ఈ బ్లాక్‌ జాబ్‌ నాకు ఎంతో ఇష్టం’ అని బైల్స్‌.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నకు ఘాటైన జవాబిచ్చింది. వలసవాదుల వల్ల అమెరికన్లు నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటున్నారని.. ఆ వలసవాదులు చేసే ఉద్యోగాలను ‘బ్లాక్‌ జాబ్స్‌’గా ట్రంప్‌ విమర్శించారు. పారిస్‌ ఒలింపిక్స్‌ జిమ్నాస్టిక్స్‌ వ్యక్తిగత ఆల్‌రౌండ్‌ విభాగంలో పసిడి పతకం గెలిచిన అనంతరం.. ట్రంప్‌ ‘బ్లాక్‌ జాబ్స్‌’ విమర్శకు బైల్స్‌ పరోక్షంగా గట్టి బదులిచ్చింది.

Updated Date - Aug 04 , 2024 | 06:49 AM

Advertising
Advertising
<