ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గేమ్స్‌ ముగిశాక జరిగేది ఇదే

ABN, Publish Date - Aug 30 , 2024 | 06:21 AM

ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌ క్రీడలకు ఆతిథ్యమివ్వడమంటే మాటలు కాదు. బిలియన్లకొద్దీ డాలర్లను ఖర్చుపెడుతూ కొత్త నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. అలాగే సరికొత్త క్రీడా పరికరాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే ఏళ్ల కొద్దీ సాగిన ఈ ఏర్పాట్లన్నీ కేవలం నెల రోజులపాటు జరిగే పోటీల కోసమేననే విషయం తెలిసిందే. మరి.. ఆ తర్వాత ఏం జరుగుతుంది?

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌ క్రీడలకు ఆతిథ్యమివ్వడమంటే మాటలు కాదు. బిలియన్లకొద్దీ డాలర్లను ఖర్చుపెడుతూ కొత్త నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. అలాగే సరికొత్త క్రీడా పరికరాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే ఏళ్ల కొద్దీ సాగిన ఈ ఏర్పాట్లన్నీ కేవలం నెల రోజులపాటు జరిగే పోటీల కోసమేననే విషయం తెలిసిందే. మరి.. ఆ తర్వాత ఏం జరుగుతుంది? వందలకొద్దీ బంతులు, నెట్స్‌, క్రీడా ఫ్లోర్లతో పాటు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఈత కొలనులు.. అలాగే ఇతర క్రీడా పరికరాలు ఏమవుతాయి? ఎలా వినియోగించుకుంటారనే సందేహం క్రీడాభిమానులకు వస్తుంటుంది. వాస్తవానికి అత్యంత ఆర్భాటంగా గేమ్స్‌ను నిర్వహించాక ఆర్గనైజర్లకు ఆ పనిముట్లు, క్రీడా పరికరాలతో ఎలాంటి ఉపయోగమూ ఉండదు. అందుకే వాటిని తయారీదారులకు తిరిగిచ్చేయడమో లేక స్థానిక క్లబ్బులకు, సంస్థలకు డొనేట్‌ చేయడమో జరుగుతూంటుంది. అయితే ప్రస్తుత పారిస్‌ గేమ్స్‌ నిర్వాహకులు తెలిపిన దాని ప్రకారం.. ఈ గేమ్స్‌ కోసం ఉపయోగించిన మొత్తం 1.2 మిలియన్‌ క్రీడాపరికరాల్లో 75 శాతం ఆయా క్రీడా సమాఖ్యల నుంచి లీజుకు తీసుకున్నవేనట. కాబట్టి తిరిగి అవి తమ స్వంతదారుల చెంతకు వెళ్లనున్నాయి. ఇలా ఫ్రెంచ్‌ వాలీబాల్‌ సమాఖ్య తమ దగ్గరకు వచ్చిన బంతులు, నెట్స్‌, పోస్ట్స్‌, స్పోర్ట్స్‌ ఫ్లోర్లు దేశంలోని ఇతర క్రీడా సెంటర్లకు పంపిణీ చేయనుంది. అలాగే తైక్వాండో సమాఖ్య కూడా పారిస్‌ రీజియన్‌లోని అనేక క్లబ్బులకు సరఫరా చేస్తుంది. ఇక మిగిలిన 25 శాతం కొనుగోలు చేసిన పరికరాలను దేశంలో క్రీడాభివృద్ధి కోసం విరాళంగా ఇవ్వనున్నారు. సెయినీ సెయింట్‌ డెని్‌సలాంటి ప్రాంతాల్లో కనీస క్రీడా సదుపాయాలు కూడా లేవు. అలాంటి చోట్ల ఆయా ప్రజల ఫిట్‌నె్‌సతో పాటు ఆటల పట్ల మక్కువ పెంచేందుకు వీటిని వినియోగిస్తారు. మరోవైపు పారిస్‌ గేమ్స్‌ కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కొన్ని సౌకర్యాలను వివిధ వేదికలకు మార్చుతారు. బీచ్‌ వాలీబాల్‌ ఈవెంట్‌ను నిర్వహించిన ఈఫిల్‌ టవర్‌ స్టేడియంలోని ఇసుకను మార్విల్లేలోని డిపార్ట్‌మెంటల్‌ పార్క్‌లో మూడు పిచ్‌ల ఏర్పాటు కోసం వినియోగించనున్నారు. అలాగే స్కేట్‌బోర్డు స్ట్రీట్‌ కాంపిటీషన్‌ ఏరియాను సెయినీ సెయింట్‌ డెని్‌సలో తిరిగి ఏర్పాటు చేయబోతున్నారు. పారిస్‌ లా డిఫెన్స్‌ ఎరీనాలో ఉన్న తాత్కాలిక స్విమ్మింగ్‌పూల్స్‌ను సెయినీ సెయింట్‌ డెనిస్‌, సెవ్రాన్‌, బగ్నోలెట్‌ ప్రాంతాల్లో రీఇన్‌స్టాల్‌ చేసి వినియోగంలోకి తెస్తారు. ఇక పోటీల కోసం ప్రఖ్యాత గెర్‌ఫ్లోర్‌ కంపెనీ ఆయా వేదికల్లో 33 వేల మీటర్ల ఫ్లోర్లను బిగించింది. గేమ్స్‌ ముగిశాక ఈ స్పోర్ట్స్‌ ఫ్లోరింగ్‌ను తొలగించి పారిస్‌ రీజియన్‌లోని మున్సిపాలిటీలు, క్లబ్బుల్లో తిరిగి ఏర్పాటు చేయనుంది. మరోవైపు ఒలింపిక్‌ చరిత్రలోనే తొలిసారిగా 12 ప్రాంతాల్లో సెకండ్‌ హ్యాండ్‌ ఫెయిర్స్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందులో వేలాది యూనిఫామ్స్‌, కప్స్‌, ఫ్లాగ్స్‌, అథ్లెట్లు వినియోగించిన టవల్స్‌, వేదికలను అలంకరించేందుకు ఉపయోగించిన వస్తువులను అమ్మకానికి ఉంచుతారు. ఇవే కాకుండా వేలాది ట్రాలీలు, హ్యాండ్‌ ట్రక్స్‌, ఫ్యాన్లు, వ్యాక్యూమ్‌ క్లీనర్లను ఆయా క్రీడాసమాఖ్యలు, కమ్యూనిటీస్‌, వ్యాపార కంపెనీలు కొనుగోలు చేసుకునేందుకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనున్నాయి.

Updated Date - Aug 30 , 2024 | 06:21 AM

Advertising
Advertising