మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: ఫైనల్ చేరే రెండో జట్టేది? సమరానికి సిద్ధమవుతున్న రాజస్థాన్, హైదరాబాద్ జట్లు.. ఒకవేళ వర్షం పడితే..

ABN, Publish Date - May 24 , 2024 | 02:56 PM

ఆదివారం చెన్నైలో జరిగే ఐపీఎల్-2024 ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతాను ఢీకొట్టే జట్టేది? ఆ సస్పెన్స్‌కు మరికొద్ది గంటల్లో సమాధానం దొరకనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా శుక్రవారం జరగబోయే క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబద్ జట్లు తలపడబోతున్నాయి.

IPL 2024: ఫైనల్ చేరే రెండో జట్టేది? సమరానికి సిద్ధమవుతున్న రాజస్థాన్, హైదరాబాద్ జట్లు.. ఒకవేళ వర్షం పడితే..
SRH vs RR

ఆదివారం చెన్నైలో జరిగే ఐపీఎల్-2024 (IPL 2024) ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతాను ఢీకొట్టే జట్టేది? ఆ సస్పెన్స్‌కు మరికొద్ది గంటల్లో సమాధానం దొరకనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా శుక్రవారం జరగబోయే క్వాలిఫయర్-2 (Qualifier 2) మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబద్ జట్లు తలపడబోతున్నాయి (SRH vs RR). ఈ సీజన్‌లో ఈ రెండు జట్లూ అద్భుత ప్రదర్శనను కనబరిచాయి. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీని చిత్తు చేసిన రాజస్థాన్ ఉత్సాహంతో ఉంది. క్వాలిఫయర్-1లో కోల్‌కతా చేతిలో చిత్తుగా ఓడిన హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ఫైనల్ చేరాలని కృతనిశ్చయంతో ఉంది. మరి, ఏ జట్టు ఫైనల్ చేరుతుందో చూడాలి.


సన్‌రైజర్స్ టీమ్ ఎక్కువగా ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మపైనే ఆధారపడుతోంది. వీరికి మిడిలార్డర్‌లో క్లాసెన్ సహకరిస్తున్నాడు. వీరు హార్డ్ హిట్టింగ్‌కు ఈ సీజన్‌లో సరికొత్త అర్థం చెప్పారు. ఆకాశమే హద్దుగా బౌండరీల వర్షం కురిపిస్తున్నారు. అయితే చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆడడం వీరికి కాస్త సవాలే అని చెప్పక తప్పదు. ఎందుకంటే తీవ్ర ఉక్కపోత వాతావరణంతో ఉండే చెన్నై పిచ్‌పై బంతి స్లోగా వస్తుంది. ముఖ్యంగా అశ్విన్, చాహల్ వంటి స్పిన్ ద్వయాన్ని ఎదుర్కొని పరుగులు చేయడం అంత సులభం కాదు. ఇక, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ నుంచి కూడా హైదరాబాద్ బ్యాటర్లకు సవాలు ఎదురుకానుంది.


సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, హెట్‌మెయేర్ వంటి బ్యాటర్లతో రాజస్థాన్ బ్యాటింగ్ కూడా పటిష్టంగానే ఉంది. వీళ్లను కమిన్స్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్‌లతో నిండిన హైదరబాద్ పేసర్లు ఎలా నిలువరిస్తారో చూడాలి. ఇప్పటివరకు ఈ రెండు జట్లు 19 సార్లు తలపడగా హైదరాబాద్ 10 మ్యాచ్‌ల్లో, రాజస్థాన్ 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య ఒక్క మ్యాచ్ మాత్రమే జరిగింది. ఆ మ్యాచ్‌లో హైదరాబాద్ టీమ్ 1 పరుగు తేడాతో విజయం సాధించింది.

ఒకవేళ వర్షం పడితే..

మ్యాచ్ జరిగే వేదిక అయిన చెన్నైలో ఒకవేళ వర్షం పడితే మ్యాచ్‌ను రిజర్వ్ డే అయిన శనివారానికి మారుస్తారు. ఆ రోజు కూడా మ్యాచ్ సాధ్యం కాకపోతే లీగ్ దశలో ఎక్కువ పాయింట్లు సాధించిన టీమ్ ఫైనల్ చేరుతుంది. లీగ్ దశలో రాజస్థాన్ కంటే హైదరాబాద్‌కు ఎక్కువ పాయింట్లు ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ టీమ్ ఫైనల్ చేరుతుంది.


జట్లు:

సన్‌రైజర్స్ హైదరాబాద్ (అంచనా):

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, విజయకాంత్, నటరాజన్

రాజస్థాన్ రాయల్స్ (అంచనా):

యశస్వి జైస్వాల్, టామ్ కోలర్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హెట్‌మేయర్, రోవ్‌మన్ పావెల్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, చాహల్

ఇవి కూడా చదవండి..

Dinesh Karthik: ఆ సమయంలో కార్తీక్ చేసిన సహాయం మరువలేనన్న కోహ్లీ.. కన్నీళ్లు పెట్టుకున్న దీపిక..!


IPL 2024: ఆర్సీబీ ఆటగాళ్లని ఉద్దేశించి అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు!


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 24 , 2024 | 02:56 PM

Advertising
Advertising