ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హాకీలో క్వార్టర్స్‌ చేరినట్టే!

ABN, Publish Date - Jul 31 , 2024 | 06:38 AM

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో చరిత్ర సృష్టించిన భారత పురుషుల హాకీ జట్టు పారి్‌సలోనూ పతకం దిశగా దూసుకెళ్తోంది. తమ గ్రూప్‌-బిలో వరుసగా మూడో మ్యాచ్‌ను ఓటమి లేకుండా ముగించింది. ఆరంభంలో న్యూజిలాండ్‌పై గెలిచి, తర్వాత అర్జెంటీనాతో పోరును డ్రాగా ముగించిన

ఐర్లాండ్‌పై భారత్‌ విజయం

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో చరిత్ర సృష్టించిన భారత పురుషుల హాకీ జట్టు పారి్‌సలోనూ పతకం దిశగా దూసుకెళ్తోంది. తమ గ్రూప్‌-బిలో వరుసగా మూడో మ్యాచ్‌ను ఓటమి లేకుండా ముగించింది. ఆరంభంలో న్యూజిలాండ్‌పై గెలిచి, తర్వాత అర్జెంటీనాతో పోరును డ్రాగా ముగించిన భారత్‌.. మంగళవారం ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ మరోసారి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకోవడంతో భారత్‌ 2-0తో ఐర్లాండ్‌ను చిత్తుచేసింది. మ్యాచ్‌లో నమోదైన రెండు గోల్స్‌ను హర్మన్‌ప్రీత్‌ 13వ, 19వ నిమిషాల్లో చేశాడు. ప్రధమార్ధం ముగిసేసరికే 2-0తో ముందంజలో నిలిచిన భారత్‌.. చివరిదాకా ఆధిక్యాన్ని కాపాడుకొని పైచేయి సాధించింది. రెండు విజయాలు, ఓ డ్రాతో మొత్తం 7 పాయింట్లను ఖాతాలో వేసుకున్న భారత్‌ ప్రస్తుతం గ్రూప్‌-బి నుంచి టాపర్‌గా కొనసాగుతోంది. ఈ క్రమంలో మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలున్న భారత్‌.. క్వార్టర్‌ఫైనల్‌ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకున్నట్టే. ఈ గ్రూప్‌లో వరుసగా మూడో ఓటమితో ఐర్లాండ్‌ క్వార్టర్స్‌ రేస్‌ నుంచి పూర్తిగా నిష్క్రమించగా.. బెల్జియం, ఆస్ట్రేలియా చెరో రెండు విజయాలతో ఆరేసి పాయింట్లతో సంయుక్తంగా రెండోస్థానంలో ఉన్నాయి. రెండు గ్రూప్‌ల నుంచి తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తాయి. తదుపరి పోరులో భాగంగా గురువారం బెల్జియంతో ఆడనున్న భారత్‌.. గ్రూప్‌లో ఆఖరిదైన ఐదో మ్యాచ్‌ను శుక్రవారం ఆస్ట్రేలియాతో తలపడనుంది.

Updated Date - Jul 31 , 2024 | 06:38 AM

Advertising
Advertising
<