రాజ్‌కుమార్ హ్యాట్రిక్
ABN, Publish Date - Sep 12 , 2024 | 03:27 AM
డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో జోరు కొనసాగిస్తూ సెమీఫైనల్‌కు దూసుకుపోయింది. యువ స్ట్రయికర్ రాజ్‌కుమార్ హ్యాట్రిక్‌తో అదరగొట్టడంతో..
సెమీ్‌సలో భారత్
మలేసియాపై భారీ విజయం
ఆసియా చాంపియన్స్ ట్రోఫీ
హులున్‌బూయిర్ (చైనా): డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో జోరు కొనసాగిస్తూ సెమీఫైనల్‌కు దూసుకుపోయింది. యువ స్ట్రయికర్ రాజ్‌కుమార్ హ్యాట్రిక్‌తో అదరగొట్టడంతో..బుధవారం జరిగిన మ్యాచ్‌లో మనోళ్లు 8-1తో మలేసియాను చిత్తు చేశారు. రాజ్‌కుమార్ (3, 25, 33 నిమిషాలు)తోపాటు అరైజీత్ సింగ్ (6, 39ని.), జుగ్‌రాజ్ సింగ్ (7వ), హర్మన్‌ప్రీత్ సింగ్ (22వ), ఉత్తమ్‌సింగ్ (40వ) గోల్స్ సాధించారు. మలేసియా తరపున ఏకైక గోల్‌ను అఖీముల్లా (34వ) చేశాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం అందుకున్న భారత్ తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మొత్తం ఆరు జట్లు రౌండ్ రాబిన్ లీగ్‌లో తలపడుతున్నాయి. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ఈనెల 16న జరిగే సెమీ్‌సలో ఢీకొంటాయి. 17న ఫైనల్ జరుగుతుంది. గత మ్యాచ్‌ల్లో చైనా, జపాన్‌పై గెలుపొందిన భారత్..గురువారం కొరియాతో, శనివారం పాకిస్థాన్‌తో ఆడుతుంది.
Updated Date - Sep 12 , 2024 | 03:27 AM