ఒలింపిక్స్‌లో ‘రేపిస్ట్’
ABN, Publish Date - Jul 26 , 2024 | 03:57 AM
నెదర్లాండ్స్‌కు చెందిన బీచ్ వాలీబాల్ ప్లేయర్ స్టీవెన్ వాన్ డి వెల్డె నేపథ్యం వింటే ఎవరైనా వణికిపోతారేమో.. సరిగ్గా పదేళ్ల క్రితం అతను 12 ఏళ్ల బ్రిటిష్ స్కూల్ విద్యార్థినిని రేప్ చేశాడు. అప్పుడు స్టీవెన్ వయస్సు 19 ఏళ్లు....
క్రీడా గ్రామంలోకి నో ఎంట్రీ
నెదర్లాండ్స్‌కు చెందిన బీచ్ వాలీబాల్ ప్లేయర్ స్టీవెన్ వాన్ డి వెల్డె నేపథ్యం వింటే ఎవరైనా వణికిపోతారేమో.. సరిగ్గా పదేళ్ల క్రితం అతను 12 ఏళ్ల బ్రిటిష్ స్కూల్ విద్యార్థినిని రేప్ చేశాడు. అప్పుడు స్టీవెన్ వయస్సు 19 ఏళ్లు. ఈ నేరాన్ని అంగీకరించడంతో 2016లో నాలుగేళ్ల శిక్ష విధించారు. అయితే యూకే ఆ తర్వాత నెదర్లాండ్స్‌లో శిక్ష అనుభవించిన తను 13 నెలలకే విడుదలయ్యాడు. అనంతరం వాలీబాల్ కెరీర్‌ను కొనసాగించడంతో పాటు తాజాగా తమ దేశం తరఫున ఒలింపిక్స్‌కు కూడా ఎంపికయ్యాడు. కానీ జట్టులో అతడిని చేర్చడంపై విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. అందుకే స్టీవెన్‌ను ఒలింపిక్ విలేజ్‌లో ఉంచడం లేదు. అలాగే గేమ్స్ జరిగినన్ని రోజులు కూడా మీడియాతో మాట్లాడవద్దని నెదర్లాండ్స్ అధికారులు ఆదేశించారు. మరోవైపు రెండేళ్ల క్రితమే వాలీబాల్ ప్లేయర్, పోలీస్ ఆఫీసర్ కూడా అయిన కిమ్ బెహ్రెన్ను స్టీవెన్ వివాహం చేసుకోవడం గమనార్హం.
Updated Date - Jul 26 , 2024 | 03:57 AM