నితీశ్ టెస్ట్ అరంగేట్రం ఖాయం?
ABN, Publish Date - Nov 21 , 2024 | 06:08 AM
టీ20లలో అందివచ్చిన అవకాశాలను అద్భుతంగా వినియోగించుకొని భారత జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్న తెలుగు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి..టె్‌స్టల్లోనూ అరంగేట్రం చేసే
తుది జట్టులో ఉండాలంటున్న రవిశాస్త్రి, గంగూలీ
పెర్త్: టీ20లలో అందివచ్చిన అవకాశాలను అద్భుతంగా వినియోగించుకొని భారత జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్న తెలుగు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి..టె్‌స్టల్లోనూ అరంగేట్రం చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఆసీ్‌సతో పెర్త్ టెస్ట్‌కు భారత జట్టు కూర్పులో బౌలింగ్ ఆల్‌రౌండర్ ఉండడం ఖాయమే. పైగా..పెర్త్ వికెట్ బౌన్స్‌కు అనుకూలిస్తుంది. ఈనేపథ్యంలో పేస్ బౌలర్ నితీశ్‌కు తుది 11 మందిలో చోటు లభించే అవకాశాలు మెరుగయ్యాయి. ఇంకా..బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మాటలను బట్టిచూస్తే నితీశ్‌కు స్థానం ఖాయమేనని తెలుస్తుంది. ఇక..భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి, మాజీ కెప్టెన్ గంగూలీ కూడా తుది జట్టులో నితీశ్ ఉండాల్సిందేననడం విశేషం. నాలుగో బౌలర్‌గా, బ్యాటర్‌గా అతడు జట్టుకు ఎంతో సమతూకం తెస్తాడని వారు అభిప్రాయపడ్డారు. కాగా..గిల్ విషయమై మ్యాచ్‌రోజు ఉదయం నిర్ణయం తీసుకుంటామని మోర్కెల్ చెప్పాడు. ఎడమచేతి బొటన వేలి గాయం నుంచి గిల్ కోలుకుంటున్నాడని అన్నాడు.
ఖలీల్ స్థానంలో యశ్ దయాళ్: భారత రిజర్వ్ పేసర్ల జాబితాలో ఎడమ చేతి వాటం బౌలర్ యశ్ దయాళ్‌ను చేర్చారు. రిజర్వ్ పేసర్‌గా ఉన్న ఖలీల్ అహ్మద్ గాయపడడంతో అతడిని స్వదేశం పంపనున్నారు.
Updated Date - Nov 21 , 2024 | 06:08 AM