ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

RCB: ఆర్సీబీని చుట్టుముట్టిన ‘హిందీ’ వివాదం.. సొంత టీమ్‌పై భగ్గుమంటున్న కన్నడ ఫ్యాన్స్

ABN, Publish Date - Nov 28 , 2024 | 03:12 PM

కూర్చున్న చెట్టు కొమ్మనే నరుక్కుంటున్న చందంగా ఆర్సీబీ తీసుకున్న తాజా నిర్ణయం జట్టుకి అభిమానులకు మధ్య చిచ్చు పెట్టింది. దీంతో సొంత జట్టుపైనే కన్నడ ఫ్యాన్స్ నిప్పులు చెరుగుతున్నారు.

RCB

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఆర్సీబీని అత్యంత దురదృష్టకరమైన జట్టుగా చెప్తారు. అగ్రశ్రేణి ఆటగాళ్లు, భారీ అభిమాన గణం ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క ప్రీమియర్ లీగ్ ట్రోఫీని కూడా ఈ జట్టు అందుకోలేకపోయింది. ఇదిలా ఉంటే ఈ ఫ్రాంచైజ్ ఇప్పుడు కొత్త వివాదంలో చిక్కుకుంది. ప్రేక్షకుల పరిధిని పెంచుకోవాలని చూసి కన్నడిగుల ఆగ్రహానికి గురైంది. దీంతో ఎక్స్‌లో ‘స్టాప్ హిందీ ఇంపోజిషన్’ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.


ఒక్క ఇన్ స్టాగ్రామ్ లోనే పది మిలియన్లకు పైగా అభిమానులున్న ఆర్సీబీ ఇప్పడు మరింత విస్తరించాలనుకుంది. అందుకే ఎక్స్ లో ఆర్సీబీ హిందీ పేరుతో ఓ కొత్త అకౌంట్ ను తెరిచింది. ఈ ఒక్క పనితో కన్నడ అభిమానుల చేతికి చిక్కింది. ఇప్పటికే దేశ భాషగా హిందీని బలవంతంగా ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తోందంటూ కేంద్రంపై తమిళనాడు ప్రభుత్వం భగ్గుమంటోంది. కర్ణాటకలోనూ కొందరు భాషాభిమానులు దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ప్రత్యేకంగా హిందీ హ్యాండిల్ ను తెరవడం అభిమానులను ఆగ్రహానికి గురిచేస్తోంది.


ఈ వివాదంపై ఆర్సీబీ యాజమాన్యం స్పందిస్తూ.. తమకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారని.. వారందరికీ చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నామని చెప్తోంది. అందుకే త్వరలోనే మరిన్ని భాషల్లోనూ ఎక్స్ ఖాతాలు తెరవనున్నట్టు తెలిపింది. ఇప్పటికే ఆర్సీబీకి ఇంగ్లీష్ తో పాటు కన్నడ హ్యాండిల్స్ ఉన్నాయి.

Team India: ఆస్ట్రేలియా ప్రధానితో టీమిండియా.. కోహ్లీతో ఏం మాట్లాడారు..


Updated Date - Nov 28 , 2024 | 03:15 PM