విరాట్‌ను దాటేశాడు
ABN, Publish Date - Nov 30 , 2024 | 04:49 AM
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర కలిగిన ఆటగాడిగా నిలిచిన రిషభ్ పంత్ మరో ఘనత కూడా దక్కించుకున్నాడు. భారత క్రికెట్‌లో వేతనం రూపంలో
ఆర్జనలో పంత్‌దే అగ్రస్థానం
న్యూఢిల్లీ: ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర కలిగిన ఆటగాడిగా నిలిచిన రిషభ్ పంత్ మరో ఘనత కూడా దక్కించుకున్నాడు. భారత క్రికెట్‌లో వేతనం రూపంలో ఎక్కువగా ఆర్జించే ఆటగాడిగా విరాట్‌ను అధిగమించాడు. ఇప్పుడు పంత్ బీసీసీఐ నుంచి రూ.30 కోట్లు అందుకోబోతున్నాడు. ఎలాగంటే.. ఐపీఎల్ వేలంలో అతడిని లఖ్‌నవూ రూ.27 కోట్లకు తీసుకుంది. అలాగే బోర్డు కాంట్రాక్ట్‌లో గ్రేడ్ ‘బి’లో ఉన్న పంత్‌కు రూ.3 కోట్ల వార్షిక వేతనం దక్కుతుంది. దీంతో మొత్తంగా అతడు రూ.30 కోట్లతో టాప్‌లో నిలిచాడు. అటు విరాట్‌ను ఆర్‌సీబీ రూ.21 కోట్లకు రిటైన్ చేసుకోగా.. గ్రేడ్ ఎ+లో ఉన్న అతడి వార్షిక వేతనం రూ.7 కోట్లుగా ఉంది. దీంతో తను రూ.28 కోట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. శ్రేయాస్ ఐపీఎల్ ధర రూ. 26.75 కోట్లుగా ఉన్నా తనకు బోర్డు కాంట్రాక్ట్ లేదు.
Updated Date - Nov 30 , 2024 | 04:49 AM