ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రిస్క్‌ తీసుకుంటేనే మజా

ABN, Publish Date - Oct 15 , 2024 | 05:55 AM

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత బ్యాటర్ల ఆటతీరు విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. దాదాపు మూడు రోజుల ఆట వర్షార్పణమైనా చివరి రెండు రోజుల ఆటలోనే మ్యాచ్‌ ఫలితం వచ్చేలా రోహిత్‌ సేన చెలరేగింది. అలా రిస్క్‌ తీసుకుని ఆడితేనే

మా బ్యాటర్ల దూకుడును ఆపలేను

టీమిండియా చీఫ్‌ కోచ్‌ గంభీర్‌

టీమిండియా ప్రాక్టీస్‌ సందర్భంగా

కోచ్‌ గంభీర్‌, కెప్టెన్‌ రోహిత్‌

బెంగళూరు: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత బ్యాటర్ల ఆటతీరు విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. దాదాపు మూడు రోజుల ఆట వర్షార్పణమైనా చివరి రెండు రోజుల ఆటలోనే మ్యాచ్‌ ఫలితం వచ్చేలా రోహిత్‌ సేన చెలరేగింది. అలా రిస్క్‌ తీసుకుని ఆడితేనే ఫలితం వస్తుందని కోచ్‌ గంభీర్‌ చెబుతున్నాడు. పైగా అలాంటి ఆటను ప్రదర్శించగల సత్తా ఉన్న తమ ప్లేయర్లను ఎందుకు అడ్డుకోవాలని ప్రశ్నించాడు. బుధవారం నుంచి కివీ్‌సతో టెస్టు సిరీస్‌ ఆరంభం కానుండగా కోచ్‌ గంభీర్‌ విలేకరులతో మాట్లాడాడు. ‘తమ సహజమైన శైలితో బ్యాటింగ్‌ చేస్తూ ఒక్క రోజులోనే 400-500 పరుగులను సాధించగల సత్తా ఉన్న బ్యాటర్లను నేనెందుకు ఆపాలి? ఆడాల్సి వచ్చినప్పుడు అలాగే ఆడతాం. ఎంత రిస్క్‌ తీసుకుంటే అంత ఫలితం ఉంటుంది. అలాగే ఒక్కోసారి 100 పరుగులకే ఆలౌట్‌ అయ్యే పరిస్థితి కూడా ఎదురవ్వచ్చు. మరోవైపు డ్రాకోసం ఆడాల్సివస్తే రెండు రోజులైనా క్రీజులో నిలవగలిగేలా జట్టు ఉండాలని కోరుకుంటున్నా. అలా ఆడే బ్యాటర్లు కూడా మా దగ్గర ఉన్నారు. ఏదేమైనా పరిస్థితులకు తగ్గట్టుగా ముందుకెళ్లాల్సి ఉంటుంది. అదే టెస్టు క్రికెట్‌ అంటే. ఎప్పుడూ ఒకేలా ఆడితే ఎదగలేం’ అని గౌతీ తేల్చాడు. మరోవైపు భారత్‌ను ఓడించే సత్తా న్యూజిలాండ్‌కు ఉందని, ఆ జట్టులో అద్భుత క్రికెటర్లున్న విషయం మరువరాదన్నాడు. అందుకే ఈ సిరీస్‌ తమకు సవాల్‌లాంటిదేనని చెప్పాడు. ప్రస్తుతానికైతే వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌ప ఫైనల్‌ గురించి ఆలోచన లేదని, కివీ్‌సతో సిరీస్‌ నెగ్గడంపైనే దృష్టి సారించినట్టు గంభీర్‌ పేర్కొన్నాడు.


విరాట్‌ ఫామ్‌పై ఆందోళన ఎందుకు?

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీ్‌సలో స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయాడు. అయితే ప్రతీ మ్యాచ్‌కూ అతడి ఫామ్‌ను అంచనా వేయడం సరికాదని కోచ్‌ గంభీర్‌ స్పష్టం చేశాడు. ‘విరాట్‌ అత్యుత్తమ ఆటగాడు. అరంగేట్రం చేసినప్పుడున్న పరుగుల దాహం నేటికీ కొనసాగుతోంది. రానున్న కివీస్‌, ఆసీ్‌సతో సిరీస్‌ల్లో భారీగా పరుగులు సాధించగలడనే నమ్మకం ఉంది. అందుకే అతడి ఫామ్‌పై ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఏదేమైనా ఓ మ్యాచ్‌కో.. సిరీ్‌సకో ఆటగాడి ప్రదర్శనను అంచనా వేయడం సరికాదు. ప్రతీ ఆటగాడికి మద్దతుగా నిలవాల్సిన అవసరం నాకుంది’ అని గంభీర్‌ స్పష్టం చేశాడు.

Updated Date - Oct 15 , 2024 | 05:55 AM