ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Riyan Parag: ఆ స్కెచ్ వాళ్లిద్దరిదే.. తన అద్భుత ప్రదర్శన వెనక ఉన్న ప్లానింగ్ గురించి వెల్లడించిన రియాన్ పరాగ్!

ABN, Publish Date - Jul 28 , 2024 | 01:45 PM

శ్రీలంకతో శనివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆల్ రౌండర్ రియాన్ పరాగ్ అద్భుతం చేశాడు. రెగ్యులర్ స్పిన్నర్లు అయిన అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ చేతులెత్తేసిన చోట సత్తా చాటాడు. 8 బంతులు వేసి 5 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.

Riyan Parag

శ్రీలంకతో శనివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆల్ రౌండర్ రియాన్ పరాగ్ (Riyan Parag) అద్భుతం చేశాడు. రెగ్యులర్ స్పిన్నర్లు అయిన అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ చేతులెత్తేసిన చోట సత్తా చాటాడు. 8 బంతులు వేసి 5 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. అసలు అలాంటి కీలక సమయంలో పరాగ్‌కు బంతిని ఇవ్వడమే ఆశ్చర్యమంటే, తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అతడు మూడు వికెట్లు పడగొట్టడం ఇంకా ఆశ్చర్యం (Riyan Parag Bowling) . తన ఫీట్ గురించి మ్యాచ్ అనంతరం పరాగ్ మాట్లాడాడు (Ind vs SL).


``నేను నెట్స్‌లో చాలా ఎక్కువ సేపు బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తా. బౌలింగ్ చేయడాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తా. ఎక్కడ బంతులేయాలి అనే విషయంపై గంభీర్ సర్‌తో చాలా సేపు చర్చిస్తుంటా. నా బౌలింగ్ వెనుక గంభీర్ పాత్ర ఉంది. పిచ్ స్పిన్‌కు సహకరిస్తే 16 లేదా 17వ ఓవర్లో నా చేత బౌలింగ్ చేయించాలని గంభీర్, సూర్య అనుకున్నారు. నాకు బాల్ ఇచ్చినపుడు స్టంప్స్‌ను టార్గెట్ చేస్తూ బంతులేశా. ఫలితం నాకు అనుకూలంగా వచ్చింది`` అని పరాగ్ చెప్పాడు.


మ్యాచ్‌లో తమ జట్టు ప్రదర్శనపై కెప్టెన్ సూర్య సంతృప్తి వ్యక్తం చేశాడు. ``రియాన్ బౌలింగ్ గురించి నాకు తెలుసు. నెట్స్‌లో అతడి బౌలింగ్ చూశా. అతడు మాకు కీలక ఆటగాడని ఇంతకు ముందే చెప్పాను. తొలి మ్యాచ్‌లో మా ప్రదర్శన చాలా సంతృప్తి కలిగించింది. నాకు వేరే దేశంలో ఆడుతున్నట్టు అనిపించడం లేదు. భారత్‌లోనే ఆడుతున్నట్టు ఉంద``ని సూర్య అన్నాడు.

ఇవి కూడా చదవండి..

Suryakumar Yadav: సగం మ్యాచ్‌ల్లోనే కోహ్లీ రికార్డును సమం చేసిన సూర్య.. శ్రీలంకతో మ్యాచ్‌లో కెప్టెన్ అరుదైన ఘనత!


India vs Srilanka: ఒకే ఓవర్‌లో చేతులు మార్చి బౌలింగ్ చేసిన శ్రీలంక స్పిన్నర్.. ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయి?


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 28 , 2024 | 01:45 PM

Advertising
Advertising
<