ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rohan Bopanna : ఆఖరి మ్యాచ్‌ ఆడేశా

ABN, Publish Date - Jul 30 , 2024 | 01:45 AM

ఆటగాడిగా భారత టెన్ని్‌సతో రోహన్‌ బోపన్న ప్రస్థానం ముగిసింది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌తో 22 ఏళ్ల తన టెన్నిస్‌ కెరీర్‌కు అతడు ఘనంగా ముగింపు పలికాడు. శ్రీరామ్‌ బాలాజీ జతగా పారిస్‌ ఒలింపిక్స్‌ పురుషుల డబుల్స్‌ బరిలో దిగిన బోపన్న.. తొలి రౌండ్‌లో పరాజయం

రిటైర్మెంట్‌ ప్రకటించిన రోహన్‌ బోపన్న

న్యూఢిల్లీ: ఆటగాడిగా భారత టెన్ని్‌సతో రోహన్‌ బోపన్న ప్రస్థానం ముగిసింది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌తో 22 ఏళ్ల తన టెన్నిస్‌ కెరీర్‌కు అతడు ఘనంగా ముగింపు పలికాడు. శ్రీరామ్‌ బాలాజీ జతగా పారిస్‌ ఒలింపిక్స్‌ పురుషుల డబుల్స్‌ బరిలో దిగిన బోపన్న.. తొలి రౌండ్‌లో పరాజయం చవిచూశాడు. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో లియాండర్‌ పేస్‌ పురుషుల సింగిల్స్‌లో కాంస్యం గెలిచిన తర్వాత విశ్వక్రీడల టెన్ని్‌సలో భారత్‌కు మరో పతకం లభించలేదు. అయితే 2016 రియో గేమ్స్‌లో సానియా మీర్జాతో కలిసి మిక్స్‌డ్‌ డబుల్స్‌ పతకాన్ని రోహన్‌ త్రుటిలో మిస్సయ్యాడు. ఆ క్రీడల్లో బోపన్న, సానియా జోడీ నాలుగో స్థానంలో నిలిచింది. పారిస్‌ ఒలింపిక్స్‌ ఆరంభ రౌండ్‌లోనే వెనుదిరిగినా..రెండు దశాబ్దాల తన టెన్నిస్‌ కెరీర్‌పట్ల బోపన్న సంతృప్తి ప్రకటించాడు. ‘దేశం తరపున ఇదే నా ఆఖరి మ్యాచ్‌. టెన్నిస్‌ క్రీడలో ప్రస్తుతం నేను ఏ స్థాయిలో ఉన్నానో అర్థమైంది. ఇకపై సాధ్యమైనంత కాలం టెన్నిస్‌ సర్క్యూట్‌ను ఎంజాయ్‌ చేస్తా’ అని బోపన్న అన్నాడు. తద్వారా 2026 జపాన్‌ ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశాలు ఏమాత్రం లేవని అతడు స్పష్టంజేసినట్టయింది. డేవిస్‌ కప్‌ నుంచి రోహన్‌ ఇప్పటికే రిటైరైన సంగతి తెలిసిందే.

ఇదీ కెరీర్‌ ఘనత

కెరీర్‌లో మొత్తం 26 డబుల్స్‌ టైటిల్స్‌ సొంతం చేసుకున్న బోపన్న..ఈ ఏడాది మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా)తో కలిసి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల డబుల్స్‌ టైటిల్‌ అందుకున్నాడు. ఆపై డబుల్స్‌లో నెం.1 ర్యాంక్‌నూ దక్కించుకున్నాడు. 2017లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ చాంపియన్‌గా నిలిచాడు. 2010, 2023లో యూఎస్‌ ఓపెన్‌లో డబుల్స్‌ ఫైనల్‌కు చేరాడు. వింబుల్డన్‌లో మూడుసార్లు (2013, 2015, 2023), ఫ్రెంచ్‌ ఓపెన్‌ (2022, 2024) రెండుసార్లు డబుల్స్‌ సెమీస్‌ వరకు వచ్చాడు. 2012, 2016 ఒలింపిక్స్‌లోనూ భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

బోపన్న జోడీ అవుట్‌

టెన్ని్‌సలో భారత పోరాటం ముగిసింది. డబుల్స్‌లో బోపన్న జంట తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. రోహన్‌ బోపన్న-శ్రీరామ్‌ బాలాజీ జంట 5-7, 2-6తో ఫ్రాన్స్‌కు చెందిన ఎడ్బర్డ్‌ రోజర్‌-గేల్‌ మోన్‌ఫిల్స్‌ ద్వయం చేతిలో పోరాడి ఓడింది. సింగిల్స్‌లో సుమిత్‌ నగాల్‌ కూడా మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే.

Updated Date - Jul 30 , 2024 | 01:45 AM

Advertising
Advertising
<