రోహిత్‌, సూర్య మెరుపులు

ABN, Publish Date - Jun 28 , 2024 | 05:00 AM

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 57) మరోసారి తన ఫామ్‌ను చాటుకున్నాడు. తాజా టీ20 వరల్డ్‌క్‌పలో తను వరుసగా రెండో అర్ధసెంచరీ సాధించగా.. అటు సూర్యకుమార్‌...

రోహిత్‌, సూర్య మెరుపులు

  • భారత్‌ 171/7

  • జోర్డాన్‌కు మూడు వికెట్లు

  • ఇంగ్లండ్‌తో సెమీస్‌

  • టీ20 వరల్డ్‌కప్‌

గయానా: కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 57) మరోసారి తన ఫామ్‌ను చాటుకున్నాడు. తాజా టీ20 వరల్డ్‌క్‌పలో తను వరుసగా రెండో అర్ధసెంచరీ సాధించగా.. అటు సూర్యకుమార్‌ (36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 47) కీలక ఇన్నింగ్స్‌తో సహకరించాడు. దీంతో గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో సెమీఫైనల్లో భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. హార్దిక్‌ పాండ్యా (13 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లతో 23 నాటౌట్‌) చివర్లో విలువైన పరుగులు జత చేశాడు. జోర్డాన్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం కడపటి వార్తలందేసరికి ఇంగ్లండ్‌ ఛేదనలో 8.1 ఓవర్లలో 5 వికెట్లకు 49 పరుగులు చేసింది. క్రీజులో బ్రూక్‌ (9), లివింగ్‌స్టోన్‌ (0) ఉన్నారు. బట్లర్‌ (23), సాల్ట్‌ (5), బెయిర్‌స్టో (0), మొయిన్‌ అలీ (8), కర్రాన్‌ (2) అవుటయ్యారు.


రోహిత్‌-సూర్య అండగా..

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. అయితే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వరుసగా రెండో హాఫ్‌ సెంచరీతో ఫామ్‌ను చాటుకోగా.. మిడిలార్డర్‌లో సూర్యకుమార్‌, హార్దిక్‌ మెరుపులతో జట్టు సవాల్‌ విసిరే స్కోరందుకుంది. మధ్య ఓవర్లలో స్పిన్నర్లు రషీద్‌, లివింగ్‌స్టోన్‌ కట్టడి చేశారు. గతంలో మూడు టీ20 వరల్డ్‌కప్‌ సెమీ్‌సల్లో అర్ధసెంచరీలు సాధించిన విరాట్‌ (9) తన పేలవ ఫామ్‌ను మళ్లీ చాటుకున్నాడు. మూడో ఓవర్‌లో ఓ అద్భుత సిక్సర్‌తో అదుర్స్‌ అనిపించి అదే ఓవర్‌లో టోప్లే బంతికి బౌల్డ్‌ అయ్యాడు. రోహిత్‌ మాత్రం ఎప్పట్లాగే ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగాడు. ఐదో ఓవర్‌లో తను రెండు ఫోర్లతో ఆకట్టుకోగా, పంత్‌ (4)ను సామ్‌ కర్రాన్‌ అవుట్‌ చేశాడు. దీంతో పవర్‌ప్లేలో జట్టు 46/2 స్కోరుతో నిలిచింది. అయితే కెప్టెన్‌కు సూర్యకుమార్‌ జత కలవడంతో పరుగుల్లో వేగం పెరిగింది. ఏడో ఓవర్‌లో సూర్య తనదైన శైలిలో ఫైన్‌ లెగ్‌ వైపు సిక్స్‌ బాదాడు. అయితే 8 ఓవర్లు ముగిసిన వెంటనే కాసేపు భారీ వర్షం కురిసింది. వర్షం తగ్గినా మైదానం తడిగా ఉండడంతో 75 నిమిషాల పాటు మ్యాచ్‌కు అంతరాయం కలిగింది.


అనంతరం రోహిత్‌-సూర్య జోడీ అడపాదడపా భారీ షాట్లతో చెలరేగింది. 13వ ఓవర్‌లో రోహిత్‌ 6, సూర్య 6,4తో 19 రన్స్‌ రాగా స్కోరు కూడా 100 దాటింది. 36 బంతుల్లో అర్ధసెంచరీ సాధించిన రోహిత్‌ను స్పిన్నర్‌ రషీద్‌ అవుట్‌ చేయడంతో మూడో వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అటు మరో ఓవర్‌ వ్యవధిలోనే సూర్యకుమార్‌ వికెట్‌ను పేసర్‌ ఆర్చర్‌ పడగొట్టాడు. చాలా ఎత్తుగా గాల్లోకి లేచిన క్యాచ్‌ను లాంగాన్‌లో జోర్డాన్‌ అందుకున్నాడు. ఈ దశలో బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేయడంతో 14-17 ఓవర్ల మధ్య పరుగులు నెమ్మదించాయి. 18వ ఓవర్‌లో హార్దిక్‌ చెలరేగి వరుసగా రెండు సిక్సర్లతో గేరు మార్చే ప్రయత్నం చేశాడు. కానీ పేసర్‌ జోర్డాన్‌ హార్దిక్‌తో పాటు దూబేను గోల్డెన్‌ డకౌట్‌గా పెవిలియన్‌కు చేర్చి భారత్‌కు షాకిచ్చాడు. అయితే 19వ ఓవర్‌లో జడేజా (17 నాటౌట్‌) రెండు ఫోర్లతో 12 రన్స్‌ రాబట్టగా.. ఆఖరి ఓవర్‌లో అక్షర్‌ (10) సిక్సర్‌ బాది అవుటైనా.. భారత్‌ స్కోరు 170 దాటగలిగింది.


స్కోరుబోర్డు

భారత్‌: రోహిత్‌ (బి) రషీద్‌ 57, విరాట్‌ కోహ్లీ (బి) టోప్లే 9, రిషభ్‌ పంత్‌ (సి) బెయిర్‌స్టో (బి) కర్రాన్‌ 4, సూర్యకుమార్‌ (సి) జోర్డాన్‌ (బి) ఆర్చర్‌ 47, హార్దిక్‌ పాండ్యా (సి) కర్రాన్‌ (బి) జోర్డాన్‌ 23, జడేజా (నాటౌట్‌) 17, శివమ్‌ దూబే (సి) బట్లర్‌ (బి) జోర్డాన్‌ 0, అక్షర్‌ పటేల్‌ (సి) సాల్ట్‌ (బి) జోర్డాన్‌ 10, అర్ష్‌దీప్‌ సింగ్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 20 ఓవర్లలో 171/7;

వికెట్ల పతనం: 1-19, 2-40, 3-113, 4-124, 5-146, 6-146, 7-170;

బౌలింగ్‌: రీస్‌ టోప్లే 3-0-25-1, జోఫ్రా ఆర్చర్‌ 4-0-33-1, సామ్‌ కర్రాన్‌ 2-0-25-1, ఆదిల్‌ రషీద్‌ 4-0-25-1, క్రిస్‌ జోర్డాన్‌ 3-0-37-3, లియామ్‌ లివింగ్‌స్టోన్‌ 4-0-24-0.

1

ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్‌ తరఫున ఎక్కువ వికెట్లు (31) తీసిన బౌలర్లుగా ఆదిల్‌ రషీద్‌, జోర్డాన్‌

2

టీ20 వరల్డ్‌కప్‌ల్లో అధిక సిక్సర్లు (50) బాదిన రెండో బ్యాటర్‌గా రోహిత్‌. గేల్‌ (63) ముందున్నాడు.

Updated Date - Jun 28 , 2024 | 05:00 AM

Advertising
Advertising