రోహిత్ స్థూలకాయుడు : కలినన్
ABN, Publish Date - Dec 13 , 2024 | 03:13 AM
అధిక బరువును కలిగి ఉండే భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇంకెంతో కాలం క్రికెట్ ఆడలేడని దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ డారిల్ కలినన్ అభిప్రాయపడ్డాడు. ఫ్లాట్ ట్రాక్‌పై మాత్రమే అతడు బ్యాటింగ్ చేయగలడని...
జొహాన్నె్‌సబర్గ్: అధిక బరువును కలిగి ఉండే భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇంకెంతో కాలం క్రికెట్ ఆడలేడని దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ డారిల్ కలినన్ అభిప్రాయపడ్డాడు. ఫ్లాట్ ట్రాక్‌పై మాత్రమే అతడు బ్యాటింగ్ చేయగలడని ఎద్దేవా చేశాడు. ‘విరాట్, రోహిత్ శరీరాలను ఓసారి గమనించండి. రోహిత్ చాలా బరువుతో ఉంటాడు. అందుకే తను ఎక్కువకాలం క్రికెట్‌లో ఉండలేడు. సుదీర్ఘ టెస్టు సిరీ్‌సల్లో ఆడే ఫిట్‌నెస్ కూడా అతనికి లేదు. పైగా తను స్వదేశంలోనే మెరుగ్గా ఆడుతూ, విదేశీ పిచ్‌లపై తేలిపోతుంటాడు. దక్షిణాఫ్రికాలో షార్ట్‌పిచ్ బంతులను బాల్స్‌ను ఆడడంలో ఎప్పుడూ విఫలమవుతుంటాడు’ అని కలినన్ విమర్శించాడు.
Updated Date - Dec 13 , 2024 | 03:13 AM