ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rohit Sharma: సుదీర్ఘ ప్రణాళికలేవీ లేవు.. రిటైర్మెంట్‌పై రోహిత్ శర్మ స్పందన ఏంటంటే..!

ABN, Publish Date - Jul 15 , 2024 | 11:08 AM

దాదాపు 13 ఏళ్ల తర్వాత టీమిండియాకు ప్రపంచకప్ అందించిన రోహిత్ శర్మ.. వెంటనే అంతర్జాతీ టీ20 ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు. రోహిత్ ఇకపై టెస్ట్‌లు, వన్డేల్లోనే కొనసాగుతాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ వయసు 37 సంవత్సరాలు.

Rohit Sharma

దాదాపు 13 ఏళ్ల తర్వాత టీమిండియాకు ప్రపంచకప్ (T20 Worldcup) అందించిన రోహిత్ శర్మ (Rohit Sharma).. వెంటనే అంతర్జాతీ టీ20 ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు. రోహిత్ ఇకపై టెస్ట్‌లు, వన్డేల్లోనే కొనసాగుతాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ వయసు 37 సంవత్సరాలు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ పూర్తి స్థాయి రిటైర్మెంట్ (Rohit Sharma Retirement) గురించి వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది జరుగనున్న టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో కూడా టీమిండియాకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉంటాడని బీసీసీఐ కార్యదర్శ జైషా ఇటీవల స్పష్టం చేశారు.


తాజాగా డాలస్‌లో క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన రోహిత్ శర్మ.. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఓ అభిమాని రిటైర్మెంట్ గురించి ప్రశ్నించగా రోహిత్ సమాధానం ఇచ్చాడు. ``ఇంకొంత కాలం క్రికెట్ ఆడాలని అనుకుంటున్నా. అయితే సుదీర్ఘ ప్రాణాళికలేమీ లేవు`` అంటూ రోహిత్ శర్మ సమాధానం ఇచ్చాడు. అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ ఐపీఎల్‌లో మాత్రం కొనసాగనున్నాడు.


రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా అంతర్జాతీయ టీ20ల నుంచి వైదొలిగాడు. తాజా టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో 72 పరుగులు చేసి ``ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్`` అవార్డు అందుకున్న కోహ్లీ ఆ సందర్భంగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. కోహ్లీ కూడా రోహిత్ తరహాలోనే ఐపీఎల్‌లో మాత్రం ఆడబోతున్నాడు.

ఇవి కూడా చదవండి..

Pakistan: భారత్‌కు పాక్ బెదిరింపు.. వచ్చే ఏడాది పాకిస్తాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా వెళ్లకపోతే జరిగేది అదేనట..!


Wimbledon 2024 final: వింబుల్డన్ విజేత కార్లోస్ అల్కరాస్.. ఫైనల్‌లో జకోవిచ్‌పై ఘనవిజయం


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 15 , 2024 | 11:08 AM

Advertising
Advertising
<