T20 Worldcup Final: 30 బంతుల్లో 30 పరుగులు.. ఆ సమయంలో బ్రెయిన్ పని చేయలేదన్న రోహిత్ శర్మ!
ABN, Publish Date - Jul 17 , 2024 | 10:16 AM
దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ల్లో భారత్ గెలుపు నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే 5 ఓవర్లలో 30 పరుగులు చేస్తే దక్షిణాఫ్రికా గెలుస్తుంది. దూకుడుగా ఆడుతున్న క్లాసెన్ క్రీజులో ఉన్నాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్ (T20 Wolrdcup) ఫైనల్ మ్యాచ్‌ల్లో భారత్ గెలుపు నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే 5 ఓవర్లలో 30 పరుగులు చేస్తే దక్షిణాఫ్రికా గెలుస్తుంది (Ind vs SA). దూకుడుగా ఆడుతున్న క్లాసెన్ క్రీజులో ఉన్నాడు. అప్పటికి దక్షిణాఫ్రికా చేతిలో ఇంకా ఆరు వికెట్లు ఉన్నాయి. దక్షిణాఫ్రికా గెలుపు ఖాయమని అందరూ అనుకున్నారు. భారత ఆటగాళ్లు కూడా మ్యాచ్ మీద ఆశలు వదులుకున్నట్టే కనిపించారు. అయితే చివరి ఐదు ఓవర్లలో భారత ఆటగాళ్లు అద్భుతం చేశారు (T20 Wolrdcup Final Match).
బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యాతో పాటు ఫీల్డర్లు కూడా విజయం కోసం పరితపించారు. దీంతో ఒత్తిడికి తట్టుకోలేకపోయిన దక్షిణాఫ్రికా మ్యాచ్‌ను భారత్‌కు అప్పగించేసింది. అలాంటి ఉత్కంఠ పరిస్థితుల్లో రోహిత్ (Rohit Sharma) ఎలా ఆలోచించాడు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆ ప్రశ్నకు రోహిత్ సమాధానం చెప్పాడు. ``దక్షిణాఫ్రికా 30 బంతుల్లో 30 పరుగులే చేయాల్సిన దశలో ఉన్నప్పుడు మేం తీవ్ర ఒత్తిడిలో ఉన్నాం. నిజం చెప్పాలంటే నా మెదడు మొద్దుబారిపోయింది. అయితే ఆ సమయంలో ఎక్కువ దూరం ఆలోచించకుండా పరిస్థితులకు తగినట్టు ఆడాలని నిర్ణయించుకున్నా`` అని రోహిత్ చెప్పాడు.
``చివరి 5 ఓవర్లలో మేం ఆడిన తీరు మేం ఎంత ప్రశాంతంగా ఉన్నామనే దానిని సూచిస్తుంది. నిరాశలో కూరుకుపోకుండా చివరి వరకు పోరాడడం వల్లే మేం విజేతలుగా నిలిచాం. మాది గొప్ప జట్టు అనడానికి అదే నిదర్శనం`` అని రోహిత్ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వత అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు రోహిత్ గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్?
Team India: అతడు కెప్టెన్‌గా పనికిరాడు.. అందుకు సరైన వ్యక్తి కాదు
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jul 17 , 2024 | 10:16 AM