Rohit Sharma: రోహిత్ శర్మను వదిలేస్తున్న ముంబై? మరో నలుగురు స్టార్ క్రికెటర్లకు కూడా నో రిటెన్షన్..?
ABN, Publish Date - Sep 24 , 2024 | 03:13 PM
వచ్చే ఏడాది ఐపీఎల్ మెగా వేలం జరగబోతోంది. ఈ నేపథ్యంలో చాలా ఫ్రాంఛైజీలు ఎన్నో ఏళ్లుగా తమ జట్టుతో పాటు ఉన్న కీలక ఆటగాళ్లను వదులుకునేందుకు సిద్ధమవుతున్నాయి. బీసీసీఐ ఇంకా రిటెన్షన్ నిబంధనలను వెల్లడించలేదు. ఎంత మంది పాత ఆటగాళ్లను తమతో ఉంచుకోవచ్చు అనే విషయంలో ఆయా ఫ్రాంఛైజీలకు క్లారిటీ లేదు.
వచ్చే ఏడాది ఐపీఎల్ (IPL) మెగా వేలం జరగబోతోంది. ఈ నేపథ్యంలో చాలా ఫ్రాంఛైజీలు ఎన్నో ఏళ్లుగా తమ జట్టుతో పాటు ఉన్న కీలక ఆటగాళ్లను వదులుకునేందుకు సిద్ధమవుతున్నాయి. బీసీసీఐ (BCCI) ఇంకా రిటెన్షన్ నిబంధనలను వెల్లడించలేదు. ఎంత మంది పాత ఆటగాళ్లను తమతో ఉంచుకోవచ్చు అనే విషయంలో ఆయా ఫ్రాంఛైజీలకు క్లారిటీ లేదు. ఐదుగురిని రిటైన్ చేసుకునే వెసులుబాటు రావొచ్చని చాలా ఫ్రాంఛైజీలు ఆశిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆ జాబితాను సిద్ధం చేసుకున్నాయి. స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మను (Rohit Sharma) ముంబై (MI) వదిలేస్తుందనే వార్తలు వస్తున్నాయి.
రోహిత్ శర్మ మాత్రమే కాదు.. పలు ఫ్రాంఛైజీలు తమ జట్టుకు ఆడుతున్న స్టార్ ప్లేయర్లను వదిలేసుకునే ఆలోచనలో ఉన్నాయి. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఆటగాడు కేఎల్ రాహుల్‌ను వదులుకోవాలని ఆ టీమ్ అనుకుంటోందట. గత ఐపీఎల్‌లో ఓ మ్యాచ్ సందర్భంగా కేఎల్ రాహుల్‌తో ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ వచ్చే ఐపీఎల్‌లో బెంగళూరు తరఫున ఆడతాడని వార్తలు వస్తున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిని వదులుకోవాలనే ఆలోచనలో ఆర్సీబీ ఉందట. కెప్టెన్‌గా డుప్లెసీ విఫలమవుతున్న సంగతి తెలిసిందే. అతడి స్థానంలో ఓ యువ కెప్టెన్‌ను నియమించాలని ఆర్సీబీ మేనేజ్‌మెంట్ అనుకుంటోందట.
ఈ ఏడాది కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ఐపీఎల్ టైటిల్ సాధించడంలో ఆ జట్టు బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. అలాంటి అయ్యర్‌ను కోల్‌కతా వదులుకోబోతోందట. కోల్‌కతా జట్టు సునీల్ నరైన్, శ్రేయాస్ అయ్యర్, ఆండ్రూ రస్సెల్, రింకు సింగ్‌ను రిటైన్ చేసుకోవాలనుకుంటోందట. అందకే వెంకటేష్ అయ్యర్‌ను వదులుకుంటోందట. ఇక, ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ కూడా వచ్చే ఏడాది ఐపీఎల్ మెగ వేలంలో అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. వార్నర్‌ను వదులుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
irat Kohli: చెన్నై టెస్ట్‌లో అశ్విన్ అద్భుత ప్రదర్శన.. విరాట్ కోహ్లీ ఎలా అభినందించాడో చూడండి..
MS Dhoni: ధోనీ కుమార్తె జీవా చదువుతున్న స్కూల్ ఏంటో తెలుసా? ఆ స్కూల్ ఫీజు, ఇతర వివరాలు తెలిస్తే..
Rohit Sharma: గిల్‌పై రోహిత్ శర్మ ఫ్రాంక్.. కోహ్లీ చెప్పిన మాటతో నవ్వులే నవ్వులు.. వీడియో వైరల్..
Watch Video: మలింగలా బౌలింగ్ చేస్తున్నావు.. షకిబ్ బంతులపై కోహ్లీ కామెంట్.. వీడియో వైరల్..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Sep 24 , 2024 | 03:13 PM