రాయల్స్ నాలుగోసారీ
ABN, Publish Date - May 16 , 2024 | 04:59 AM
ప్లేఆ్‌ఫ్సకు చేరినా..రాజస్థాన్ రాయల్స్ మాత్రం ఓటమి బాటను వీడలేదు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఐదు వికెట్లతో పంజాబ్ కింగ్స్ చేతిలో పరాజయం చవిచూసింది. రాయల్స్‌కిది వరుసగా...
పంజాబ్ చేతిలో ఓటమి
కర్రాన్ హాఫ్ సెంచరీ
గువాహటి: ప్లేఆ్‌ఫ్సకు చేరినా..రాజస్థాన్ రాయల్స్ మాత్రం ఓటమి బాటను వీడలేదు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఐదు వికెట్లతో పంజాబ్ కింగ్స్ చేతిలో పరాజయం చవిచూసింది. రాయల్స్‌కిది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 144/9కే పరిమితమైంది. రియాన్ పరాగ్ (48), అశ్విన్ (28) మాత్రమే రాణించారు. కర్రాన్, హర్షల్, రాహుల్ చాహర్ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు. ఛేదనలో పంజాబ్ 18.5 ఓవర్లలో 145/5 స్కోరు చేసి నెగ్గింది. కెప్టెన్ సామ్ కర్రాన్ (63 నాటౌట్) కడదాకా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. రొసో (22), జితేశ్ శర్మ (22) సత్తా చాటారు. అవేశ్, చాహల్ రెండేసి వికెట్లు తీశారు. కర్రాన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. అయితే పంజాబ్ ఇప్పటికే నాకౌట్ రేసు నుంచి అవుటైన సంగతి తెలిసిందే. ఈ పరాజయంతో ప్లేఆఫ్స్‌లో టాప్-2లో నిలవడం రాజస్థాన్‌కు కష్టమే.
కర్రాన్ కెప్టెన్ ఇన్నింగ్స్: క్లిష్టమైన పిచ్‌పై 145 పరుగుల కష్టమైన ఛేదనలో పంజాబ్ కూడా మొదటి ఓవర్లోనే ప్రభ్‌సిమ్రన్ (6) వికెట్ చేజార్చుకుంది. కానీ బెయిర్‌స్టో, రొసో చక్కగా ఆడుతూ రెండో వికెట్‌కు 30 పరుగులు జత చేసి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టే బాధ్యత చేపట్టారు. ఈ దశలో తన తొలి ఓవర్ చేపట్టిన అవేశ్ మూడు బంతుల్లో హార్డ్ హిట్టర్లు రొసో, శశాంక్ (0) అవుట్ చేసి రాజస్థాన్‌లో హుషారు తెచ్చాడు. పవర్ ప్లేలో పంజాబ్ 39/3తో నిలవగా 8వ ఓవర్లో కీలకమైన బెయిర్ స్టో (14)ను అవుట్ చేసిన చాహల్..పంజాబ్‌ను దెబ్బ తీశాడు. కింగ్స్ ఇన్నింగ్స్ చప్పగా సాగుతున్న దశలో అశ్విన్ బౌలింగ్‌లో జితేష్ 6, చాహల్ బౌలింగ్ కర్రాన్ 4 కొట్టి ఒకింత ఊపు తెచ్చారు. 63 పరుగులు జత చేసి ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీలో జితే్‌షను పెవిలియన్ చేర్చిన చాహల్ రాజస్థాన్‌కు కీలక బ్రేక్ ఇచ్చాడు. ఇక..మూడు ఓవర్లలో 25 రన్స్ కావాల్సిన వేళ సందీప్ వేసిన 18వ ఓవర్లో కర్రాన్ సిక్సర్ దంచడంతో మొత్తం 10 పరుగులొచ్చాయి. 19వ ఓవర్లోనూ అవేశ్ బౌలింగ్ మరో భారీ సిక్సర్ బాదిన కర్రాన్..అశుతో్‌ష శర్మ (17 నాటౌట్) జతగా పంజాబ్ విజయాన్ని ఖాయం చేశాడు.
పంజాబ్ బౌలర్లు భళా: టాస్ గెలిచి రాజస్థాన్ బ్యాటింగ్ ఎంచుకోగా..తొలి ఓవర్లోనే జైస్వాల్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన కర్రాన్ ప్రత్యర్థికి ఝలకిచ్చాడు. అయితే శాంసన్-కొహ్లెర్ కుదురుకొని ఇన్నింగ్స్‌ను నడిపించారు. సంజూ తన సహజ శైలిలో ఆడుతూ అర్ష్‌దీప్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు దంచగా, కొహ్లెర్ మాత్రం భారీ షాట్లు ఆడలేకపోయాడు. మరోవైపు ఎలిస్, హర్షల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పవర్ ప్లేను 38/1తో రాయల్స్ ముగించింది. కానీ ఏడో ఓవర్లో శాంసన్ (18)ను ఎలిస్ క్యాచవుట్ చేయడంతో 36 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తదుపరి ఓవర్లో కొహ్లెర్‌ను స్పిన్నర్ రాహుల్ చాహర్ పెవిలియన్ చేర్చాడు. దాంతో పరాగ్, అశ్విన్ ఆచితూచి ఆడడంతో రాజస్థాన్ స్కోరుబోర్డు మందగించింది. అయితే చాహర్ వేసిన 12వ ఓవర్లో బ్యాట్ ఝళిపించిన అశ్విన్ 6,4,4 కొట్టి 17 పరుగులు రాబట్టాడు. ఈ దశలో పంజాబ్ బౌలర్లు మరోసారి విజృంభించారు. అశ్విన్‌ను అర్ష్‌దీప్ అవుట్ చేసి 50 పరుగుల నాలుగో వికెట్ భాగసామ్యాన్ని విడదీశాడు. ఇక జురెల్ (0)ను కర్రాన్, పొవెల్ (4)ను చాహర్ వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చడంతో 102/6తో రాజస్థాన్ తీవ్ర ఇక్కట్లలో పడింది. తన చివరి రెండు ఓవర్లలో ఫెరీరా (7), పరాగ్‌లను హర్షల్ అవుట్ చేయగా బౌల్ట్ (12) రనౌట్ కావడంతో ఆర్‌ఆర్ స్కోరు కనీసం 150కి కూడా చేరలేదు.
స్కోరుబోర్డు
రాజస్థాన్: జైస్వాల్ (బి) కర్రాన్ 4, కోహ్లెర్ (సి) జితేశ్ (బి) చాహర్ 18, శాంసన్ (సి) చాహర్ (బి) ఎలిస్ 18, పరాగ్ (ఎల్బీ) హర్షల్ 48, అశ్విన్ (సి) శశాంక్ (బి) అర్ష్‌దీప్ 28, జురెల్ (సి) హర్‌ప్రీత్ (బి) కర్రాన్ 0, పొవెల్ (సి అండ్ బి) చాహర్ 4, ఫెరీరా (సి) రొసో (బి) హర్షల్ 7, బౌల్ట్ (రనౌట్) 12, అవేశ్ (నాటౌట్) 3, ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 20 ఓవర్లలో 144/9; వికెట్ల పతనం: 1-4, 2-40, 3-42, 4-92, 5-97, 6-102, 7-125, 8-138, 9-144; బౌలింగ్: కర్రాన్ 3-0-24-2, అర్ష్‌దీప్ 4-0-31-1, ఎలిస్ 4-0-24-1, హర్షల్ 4-0-28-2, రాహుల్ చాహర్ 4-0-26-2, హర్‌ప్రీత్ బ్రార్ 1-0-10-0.
పంజాబ్: ప్రభ్‌సిమ్రన్ (సి) చాహల్ (బి) బౌల్ట్ 6, బెయిర్‌స్టో (సి) పరాగ్ (బి) చాహల్ 14, రొసో (సి) జైస్వాల్ (బి) అవేశ్ 22, శశాంక్ (ఎల్బీ) అవేశ్ 0, కర్రాన్ (నాటౌట్) 63, జితేశ్ (సి) పరాగ్ (బి) చాహల్ 22, అశుతోష్ (నాటౌట్) 17, ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: 18.5 ఓవర్లలో 145/5; వికెట్ల పతనం: 1-6, 2-36, 3-36, 4-48, 5-111; బౌలింగ్: బౌల్ట్ 3-0-27-1, సందీప్ 4-0-28-0, అవేశ్ 3.5-0-28-2, అశ్విన్ 4-0-31-0, చాహల్ 4-0-31-2.
పాయింట్ల పట్టిక
జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే
కోల్‌కతా 13 9 3 1 19 1.428
రాజస్థాన్ 13 8 5 0 16 0.273
చెన్నై 13 7 6 0 14 0.528
హైదరాబాద్ 12 7 5 0 14 0.406
ఢిల్లీ 14 7 7 0 14 -0.377
బెంగళూరు 13 6 7 0 12 0.387
లఖ్‌నవూ 13 6 7 0 12 -0.787
గుజరాత్ 13 5 7 1 11 -1.063
పంజాబ్ 13 5 8 0 10 -0.347
ముంబై 13 4 9 0 8 -0.271
2
ఐపీఎల్‌లో 500 రన్స్‌కుపైగా చేసిన రెండో అన్‌క్యాప్డ్ క్రికెటర్ రియాన్ పరాగ్. షాన్ మార్ష్ 2008లో తొలి ఆటగాడిగా నిలిచాడు.
Updated Date - May 16 , 2024 | 04:59 AM