ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rishabh Pant: పంత్ అవసరం చాలా జట్లకు ఉంది.. వేలంలోకి వస్తే రూ.30 కోట్లు గ్యారెంటీ: మాజీ క్రికెటర్

ABN, Publish Date - Oct 30 , 2024 | 06:42 PM

చాలా మంది స్టార్ క్రికెటర్లు వచ్చే ఏడాది వేలంలో అందుబాటులో రాబోతున్నారు. ఒక్కో జట్టు అత్యధికంగా ఆరుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉండడంతో మిగతా ఆటగాళ్లు వేలానికి రావడం తప్పనిసరి. ఈ నెల 31వ తేదీ నాటికి ప్రతి ఫ్రాంఛైజీ తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించాలి.

Rishab Pant

వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్‌కు (IPL 2025) ముందు జరగనున్న మెగా వేలంపై ఎంతో ఉత్కంఠ నెలకొంది. చాలా మంది స్టార్ క్రికెటర్లు వచ్చే ఏడాది వేలంలో (IPL Auction) అందుబాటులో ఉండడమే దానికి కారణం. ఒక్కో జట్టు అత్యధికంగా ఆరుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉండడంతో మిగతా ఆటగాళ్లు వేలానికి రావడం తప్పనిసరి. ఈ నెల 31వ తేదీ నాటికి ప్రతి ఫ్రాంఛైజీ తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించాలి. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆటగాడిగా విఫలమవుతున్న పంత్‌ను ఢిల్లీ రిటైన్ చేసుకోకపోవచ్చని వార్తలు వస్తున్నాయి.


ఈ నేపథ్యంలో పంత్ గురించి మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంత్‌ను ఢిల్లీ టీమ్ రిటైన్ చేసుకోకుండా వేలంలోకి వదిలేస్తే అతడి కోసం చాలా జట్లు పోటీ పడతాయని, అతడికి రూ.30 కోట్ల ధర పలికినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నాడు. ``పంత్ ఐపీఎల్‌లో కేవలం ఒక్క సీజన్‌లోనే రాణించాడని, బ్యాటర్‌గా విఫలమవుతున్నాడని, ఢిల్లీ టీమ్ అతడిని రిటైన్ చేసుకోదని అంటున్నారు. కానీ, పంత్ వేలంలోకి వస్తే భారీ ధర పలుకుతుందని రాతపూర్వకంగా హామీ ఇస్తా. ఆర్సీబీకి ఒక వికెట్ కీపర్, కెప్టెన్, బ్యాటర్ కావాలి. అలాగే పంజాబ్, చెన్నై, కోల్‌కతా టీమ్‌లు కూడా పంత్ కోసం పోటీ పడతాయ``ని ఆకాశ్ అభిప్రాయపడ్డాడు.


గుజరాత్, రాజస్థాన్ టీమ్‌లకు కూడా పంత్ అవసరం ఉందని, రిషభ్ ఒకవేళ వేలంలోకి వస్తే అతడికి రూ.30 కోట్ల ధర పలికినా ఆశ్చర్యపోనవసరం లేదని ఆకాశ్ పేర్కొన్నాడు. రోడ్డు ప్రమాదానికి గురై కోలుకున్న రిషభ్ పంత్ ఈ ఏడాది ఐపీఎల్‌లో ఢిల్లీ జట్టును కెప్టెన్‌గా నడిపించాడు. బ్యాటర్‌గా ఫర్వాలేదనిపించినా, ఎప్పటిలాగానే ఢిల్లీ టీమ్ మెరుగైన ప్రదర్శన చేయలేక వెనుకబడింది.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 30 , 2024 | 06:42 PM