రన్నరప్ ప్రజ్ఞానంద
ABN, Publish Date - Nov 16 , 2024 | 06:29 AM
టాటా స్టీల్ చెస్ ఇండియా టోర్నమెంట్‌లో ఆరంభ రౌండ్లలో అదరగొట్టిన తెలుగు గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి చివరికొచ్చేసరికి నిరాశపరిచాడు. శుక్రవారం ముగిసిన ర్యాపిడ్ విభాగం
హారికకు ఐదు, అర్జున్‌కు ఆరో స్థానం
టాటా స్టీల్ చెస్ విజేతలు కార్ల్‌సన్, గోర్యాచ్కినా
కోల్‌కతా: టాటా స్టీల్ చెస్ ఇండియా టోర్నమెంట్‌లో ఆరంభ రౌండ్లలో అదరగొట్టిన తెలుగు గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి చివరికొచ్చేసరికి నిరాశపరిచాడు. శుక్రవారం ముగిసిన ర్యాపిడ్ విభాగం ఓపెన్ కేటగిరిలో మొత్తం 9 రౌండ్లకు గాను 3.5 పాయింట్లు సాధించిన అర్జున్.. ఓవరాల్‌గా ఆరో స్థానంలో నిలిచాడు. నెంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్ 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి విజేతగా నిలిచాడు. ఇక, భారత్‌కు చెందిన ప్రజ్ఞానంద, వెస్లీ సో (అమెరికా) చెరో 5.5 పాయింట్లతో సమంగా నిలిచినా.. సూపర్ టైబ్రేక్‌లో మెరుగైన స్కోరుతో ప్రజ్ఞానంద రెండోస్థానంతో రన్నర్‌పగా నిలిచాడు. వెస్లీ మూడోస్థానంతో సరిపెట్టుకున్నాడు. మహిళల టైటిల్‌ను రష్యాకు చెందిన అలెగ్జాండ్రా గోర్యాచ్కినా దక్కించుకుంది. గోర్యాచ్కినా మొత్తం 9 రౌండ్లకు 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. నానా జాగ్నిజె (జార్జియా) 5.5 పాయింట్లతో రన్నర్‌పగా నిలవగా, భారత అమ్మాయి వంతికా అగర్వాల్ (5) మూడో స్థానం దక్కించుకుంది. ద్రోణవల్లి హారిక 4.5 పాయింట్లతో ఐదో స్థానంలో నిలవగా.. హంపి కేవలం 3 పాయింట్లతో ఆఖరిదైన పదో స్థానానికి పరిమితమైంది. దివ్యా దేశ్‌ముఖ్ (3.5), వైశాలి (3.5) ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు.
Updated Date - Nov 16 , 2024 | 06:29 AM