సాక్షి వ్యాఖ్యలు వ్యక్తిగతం
ABN, Publish Date - Oct 23 , 2024 | 01:06 AM
ఆసియా క్రీడల సెలెక్షన్ నుంచి మినహాయింపు కోరి స్వార్ధపూరితంగా వ్యవహరించినట్టు సాక్షి మాలిక్ చేసిన ఆరోపణలపై మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగట్ స్పందించింది. ‘అది ఆమె వ్యక్తిగత అభిప్రాయం....
వినేశ్ ఫొగట్
చండీగఢ్: ఆసియా క్రీడల సెలెక్షన్ నుంచి మినహాయింపు కోరి స్వార్ధపూరితంగా వ్యవహరించినట్టు సాక్షి మాలిక్ చేసిన ఆరోపణలపై మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగట్ స్పందించింది. ‘అది ఆమె వ్యక్తిగత అభిప్రాయం. నేను చేసిందాంట్లో స్వార్థమెక్కడుంది? ఒకవేళ ఒలింపిక్స్‌లో పాల్గొని దేశానికి పతకం తేవాలనుకోవడం కూడా స్వార్థమే అయితే జీవితాంతం అలాగే బతికేస్తా. తోటి సోదరిల కోసం గళమెత్తడం కూడా స్వార్థమే అయితే అలాగే భరిస్తాను. ఏదేమైనా సాక్షిని ఇప్పటికీ స్నేహితురాలిగానే భావిస్తున్నా’ అని తాజాగా ఎమ్మెల్యే కూడా అయిన వినేశ్ పేర్కొంది. భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా గతేడాది సాక్షి, బజరంగ్, వినేశ్ తదితర రెజ్లర్లు నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే సాక్షి తన బయోగ్రఫీ ‘విట్‌నె్‌స’లో వినేశ్‌పై ఆరోపణలు గుప్పించింది.
Updated Date - Oct 23 , 2024 | 01:06 AM