ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ranji Trophy Final: సచిన్ చారిత్రాత్మక రికార్డును బ్రేక్ చేసిన సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు

ABN, Publish Date - Mar 13 , 2024 | 08:47 AM

ఇటీవలే ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో అరంగేట్రం చేసిన యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అందరి ప్రశంసలు పొందగా.. తాజాగా అతడి తమ్ముడు ముషీర్ ఖాన్ రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో ఏకంగా సచిన్ టెండూలర్క్ రికార్డును బ్రేక్ చేశాడు. రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో విదర్భపై 136 పరుగుల చేసిన ముషీర్ ఖాన్ రంజీ ట్రోఫీ ఫైనల్‌లో సెంచరీ నమోదు చేసిన అతిపిన్న వయస్కుడిగా అవతరించాడు.

ఇటీవలే ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో అరంగేట్రం చేసిన యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అందరి ప్రశంసలు పొందగా.. తాజాగా అతడి తమ్ముడు ముషీర్ ఖాన్ రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో ఏకంగా సచిన్ టెండూలర్క్ రికార్డును బ్రేక్ చేశాడు. రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో విదర్భపై 136 పరుగుల చేసిన ముషీర్ ఖాన్ రంజీ ట్రోఫీ ఫైనల్‌లో సెంచరీ నమోదు చేసిన అతిపిన్న వయస్కుడిగా అవతరించాడు. 19 ఏళ్ల 14 రోజుల వయసులో ముషీర్ ఖాన్ సెంచరీ బాదగా.. సచిన్ టెండూలర్క్ 1994-95 సీజన్ ఫైనల్‌లో పంజాబ్‌పై ఏకంగా రెండు సెంచరీలు నమోదు చేశాడు. అయితే అప్పుడు సచిన్ వయసు 22 ఏళ్ల లోపు ఉంది. దీంతో రంజీ ఫైనల్‌లో సెంచరీ కొట్టిన అతి చిన్న వయస్కుడిగా ముషీర్ ఖాన్ రికార్డు సృష్టించాడు.

కాగా ఈ ఏడాది ఐసీసీ అండర్19 వరల్డ్ కప్ ఆడిన భారత్‌ జట్టులో ముషీర్ ఖాన్ ఆడాడు. ఫర్వాలేదనిపించారు. తాజాగా రంజీ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తున్నాడు. విదర్భతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ముంబై రెండు కీలకమైన వికెట్లు కోల్పోయిన దశలో ముషీర్ అద్భుతమైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ముంబై కెప్టెన్ అజింక్యా రహానే, శ్రేయస్ అయ్యర్‌లతో కలిసి కీలకమైన పరుగులు రాబట్టాడు. మొత్తం 326 బంతులు 136 పరుగులు బాదాడు.

ఇందులో 10 బౌండరీలు ఉన్నాయి. తమిళనాడుతో జరిగిన రంజీ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్‌లోనూ ముషీర్ ఖాన్ రాణించాడు. విలువైన 55 పరుగులు రాబట్టాడు. బరోడాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లోనూ ముషీర్ ఖాన్ కెరియర్‌లో తొలి ఫస్ట్-క్లాస్ డబుల్ సెంచరీని నమోద చేశాడు. ఇందులో 18 ఫోర్లు ఉన్నాయి. కాగా విదర్భ మ్యాచ్ గెలవాలంటే 528 పరుగులు సాధించాల్సి ఉంది. ప్రస్తుతం ఆ జట్టు స్కోరు 10/0 పరుగులుగా ఉంది.

Updated Date - Mar 13 , 2024 | 08:47 AM

Advertising
Advertising