ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆరు పతకాలతో సంతృప్తి

ABN, Publish Date - Aug 12 , 2024 | 02:43 AM

చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా 117 మంది అథ్లెట్లతో పయనం.. ఈసారి రెండంకెల పతకాలు ఖాయమని అంచనాలు.. తీరా చూస్తే టోక్యో గేమ్స్‌కన్నా ఒకటి తక్కువగా ఆరు మెడల్స్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కచ్చితంగా పోడియంపై...

ఆరు పతకాలతో సంతృప్తి

చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా 117 మంది అథ్లెట్లతో పయనం.. ఈసారి రెండంకెల పతకాలు ఖాయమని అంచనాలు.. తీరా చూస్తే టోక్యో గేమ్స్‌కన్నా ఒకటి తక్కువగా ఆరు మెడల్స్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కచ్చితంగా పోడియంపై నిలబడతారనుకున్న అథ్లెట్లు నిరాశపరిచారు. మరి పారిస్‌ గేమ్స్‌ను ఏ విధంగా చూడాలి? ఒక్క స్వర్ణం కూడా లేకుండా వెనుదిరిగిన మనోళ్లు విజయవంతమైనట్టా.. లేదా? ఏ దేశ క్రీడా ప్రతిభ అయినా ఒలింపిక్స్‌ పతకాల పట్టిక చూస్తే తెలుస్తుంది. టోక్యోలో 48వ స్థానంతో మురిపిస్తే.. ఈసారి పతకాలు సాధించిన 91 దేశాల్లో మనది 71వ స్థానం. అయితే ఆరుగురు అథ్లెట్లు నాలుగో స్థానంలో నిలిచి భవిష్యత్‌పై భరోసా పెంచగలిగారు. ఈ నేపథ్యంలో తాజా ఒలింపిక్స్‌లో భారత ప్రస్థానం గురించి విశ్లేషించుకుంటే..


గురి తప్పని షూటర్లు

పారిస్‌ గేమ్స్‌లో భారత పతకాల పరువు కాపాడింది మాత్రం కచ్చితంగా షూటర్లే. రియో, టోక్యోల్లో ఒక్క పతకం కూడా తేలేకపోయిన వీరు.. పారిస్‌లో మాత్రం అభిమానులను ఖుషీ చేస్తూ ఏకంగా మూడు మెడల్స్‌ను ఖాతాలో వేసుకున్నారు. ఒకే గేమ్స్‌లో భారత్‌కు గతంలో ఇన్ని పతకాలు ఏ క్రీడాంశంలోనూ రాకపోవడం గమ నార్హం. పోటీల రెండో రోజే స్టార్‌ షూటర్‌ మను భాకర్‌ 10మీటర్ల వ్యక్తిగత ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో కాంస్యంతో బోణీ చేసింది. అనం తరం మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో సరబ్‌జోత్‌తో కలిసి మను మరో కాంస్యం దక్కించుకుంది. ఇక రైఫిల్‌ 3 పొజిషన్‌లో ఎలాంటి అంచనాలూ లేని స్వప్నిల్‌ కుశాలె కంచు పతకంతో వహ్వా అనిపించుకున్నాడు.


అంచనాలు తప్పారు..

పారి్‌సకు ముందు చివరి మూడు ఒలింపిక్స్‌లోనూ బ్యాడ్మింటన్‌లో భారత్‌కు పతకాలు వచ్చాయి. కానీ ఈసారి ఎక్కువగా నిరాశపరిచిన విభాగం ఇదే. రియోలో రజతం, టోక్యోలో కాంస్యంతో ఆకట్టుకున్న స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు అంచనాలతో బరిలోకి దిగి గ్రూప్‌ దశను మాత్రమే దాటగలిగింది. అటు డబుల్స్‌లో స్వర్ణం సాధిస్తారనుకున్న సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి ఓటమి అందరికీ షాక్‌ను కలిగించింది. ఇక బాక్సర్లు కూడా ఊహించని విధంగా రిక్తహస్తాలతోనే వెనక్కి రావాల్సి వచ్చింది. ఈ విభాగం కూడా భారత్‌కు గత మూడు ఒలింపిక్స్‌లో పతకాలను అందించింది. ఎప్పటిలాగే ఆర్చరీలో తొలి ఒలింపిక్‌ మెడల్‌ ఇంకా ఊరిస్తూనే ఉంది.


వీరికి లక్కు లేకపాయె..

తాజా ఒలింపిక్స్‌లో పతకాల సంఖ్యను పక్కనబెడితే..మన ఆటగాళ్ల ప్రదర్శన మరీ తీసికట్టుగా భావించలేం. ఓవిధంగా గతంకంటే మిన్నగా ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆరు ఈవెంట్లలో భారత్‌ నాలుగో స్థానంలో నిలిచి కాస్తలో కాంస్య పతకాలను చేజార్చుకుంది. పురుషుల 10మీ. ఎయిర్‌ పిస్టల్‌లో అర్జున్‌ బబుత, మహిళల 25మీ. ఎయిర్‌ పిస్టల్‌లో మను భాకర్‌ ఇలా పతకాలు పోగొట్టుకున్నవారే. అలాగే ఇదే విభాగం మిక్స్‌డ్‌ స్కీట్‌ టీమ్‌లో అనంత్‌జీత్‌ సింగ్‌, మహేశ్వరి కేవలం ఒక పాయింట్‌తో చైనాకు కాంస్యం కోల్పోయారు. ఇక యువ షట్లర్‌ లక్ష్య సేన్‌ పురుషుల బ్యాడ్మింటన్‌ చరిత్రలో భారత్‌కు పతకం అందించే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకున్నాడు. సెమీస్‌లో తొలి గేమ్‌ను గెలిచినా ఆ ఊపు కొనసాగించలేకపోయాడు. టోక్యోలో రజతం అందుకున్న వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను కేజీ బరువు తేడాతో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. అలాగే ఆర్చరీ మిక్స్‌డ్‌ టీమ్‌లో అంకిత-ధీరజ్‌ కాంస్య పతక పోరులో వెనుకబడి అపూర్వ అవకాశాన్ని కోల్పోయారు. అన్నింటికీ మించి రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ వ్యవహారం ఎంతో బాధాకరం. ఇక్కడైతే భారత్‌కు కనీసం రజతం ఖాయంగా కనిపించింది. కానీ నిర్ణీత బరువు కంటే ఆమె 100 గ్రాములు ఎక్కువగా ఉండడంతో అనర్హత వేటు పడింది. ఒకవేళ 13న అనుకూలంగా తీర్పు వస్తే భారత్‌ ఖాతాలో మరో రజతం చేరుతుంది. తద్వారా టోక్యోతో సమానంగా ఏడు పతకాలను అందుకున్నట్టవుతుంది.


రికార్డుల మోతతో..

పతకాలు తక్కువగానే వచ్చినా కొందరు మాత్రం రికార్డులతో తమ పేరును చిరస్మరణీయం చేసుకున్నారు. ఈసారి దేశం నుంచి పతకం సాధించిన ఏకైక మహిళా అథ్లెట్‌గా షూటర్‌ మను భాకర్‌ నిలిచింది. ఒకే గేమ్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి స్వతంత్ర భారత అథ్లెట్‌గానూ చరిత్రకెక్కింది. 2008 ఒలింపిక్స్‌ నుంచి కనీసం ఇద్దరు మహిళలైనా మెడల్స్‌ అందుకున్నారు. 2012, 2016లలో ఇద్దరేసి, 2021లో ముగ్గురు పతకంతో మెప్పించారు. పారిస్‌లో ఆ చాన్స్‌ మనుకు దక్కింది. ఇక నీరజ్‌ చోప్రా కూడా ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో రెండు పతకాలు సాధించిన భారత అథ్లెట్‌గా నిలిచాడు. అంతేకాకుండా భారత ఒలింపిక్స్‌ చరిత్రలో స్వర్ణం, రజతం అందుకున్న ఏకైక అథ్లెట్‌ చోప్రానే. వీరికి తోడు 21 ఏళ్ల యువ రెజ్లర్‌ అమన్‌ సెహ్రావత్‌ భారత్‌ నుంచి ఒలింపిక్‌ మెడల్‌ సాధించిన అత్యంత పిన్నవయస్సుడిగా రికార్డులకెక్కాడు. భారత హాకీ జట్టు 52 ఏళ్లలో తొలిసారి రెండు వరుస ఒలింపిక్‌ పతకాలు అందుకుని క్రీడా ప్రేమికులను సంతోషంలో ముంచెత్తింది.

పారిస్‌లో పతక వీరులు

అథ్లెట్‌ క్రీడాంశం పతకం

మను భాకర్‌ షూటింగ్‌ కాంస్యం

మను భాకర్‌,

సరబ్‌జోత్‌ సింగ్‌ షూటింగ్‌ కాంస్యం

స్వప్నిల్‌ కుశాలె షూటింగ్‌ కాంస్యం

పురుషుల హాకీ జట్టు హాకీ కాంస్యం

నీరజ్‌ చోప్రా జావెలిన్‌ త్రో రజతం

అమన్‌ సెహ్రావత్‌ రెజ్లింగ్‌ కాంస్యం

Updated Date - Aug 12 , 2024 | 02:43 AM

Advertising
Advertising
<