ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హాకీ అమ్మాయిల రెండో గెలుపు

ABN, Publish Date - Nov 13 , 2024 | 03:51 AM

ఆసియా హాకీ చాంపియన్స్‌ ట్రోఫీలో భారత మహిళలు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేశారు. మంగళవారం జరిగిన పోరులో భారత్‌ 3-2తో దక్షిణ కొరియాను ఓడించింది...

ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ

రాజ్‌గిర్‌ (బిహార్‌): ఆసియా హాకీ చాంపియన్స్‌ ట్రోఫీలో భారత మహిళలు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేశారు. మంగళవారం జరిగిన పోరులో భారత్‌ 3-2తో దక్షిణ కొరియాను ఓడించింది. మలేసియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో డబుల్‌ గోల్స్‌తో విజృంభించిన సంగీతా కుమారి (3వ నిమిషం) కొరియాతో పోరులోనూ సత్తాచాటుతూ ఓ గోల్‌ కొట్టింది. ఇక, దీపిక (20వ, 57వ) రెండు గోల్స్‌తో చెలరేగింది. ఆతిథ్య భారత్‌ తమ మూడో మ్యాచ్‌ను గురువారం థాయ్‌లాండ్‌తో ఆడనుంది. ఇక, మంగళవారం జరిగిన ఇతర మ్యాచుల్లో జపాన్‌, థాయ్‌లాండ్‌ జట్ల మధ్య పోరు 1-1తో డ్రాగా ముగియగా.. చైనా 5-0తో మలేసియాపై గెలిచింది. చైనాకు ఇది వరుసగా రెండో విజయం.

Updated Date - Nov 13 , 2024 | 03:51 AM