ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ODi : లంక.. 27 ఏళ్ల తర్వాత

ABN, Publish Date - Aug 08 , 2024 | 05:26 AM

టీమిండియాపై లంకేయులు 27 ఏళ్ల తర్వాత ద్వైపాక్షిక సిరీస్‌ నెగ్గి.. జూలు విదిల్చారు. తొలి వన్డే టైగా ముగియగా మిగిలిన రెండు వన్డేల్లో విజయ ఢంకా మోగించిన శ్రీలంక 2-0తో సిరీ్‌సను కైవసం చేసుకుంది. మూడు వన్డేల

భారత్‌పై సిరీస్‌ విజయం

మూడో వన్డేలో గెలుపు

కొలంబో: టీమిండియాపై లంకేయులు 27 ఏళ్ల తర్వాత ద్వైపాక్షిక సిరీస్‌ నెగ్గి.. జూలు విదిల్చారు. తొలి వన్డే టైగా ముగియగా మిగిలిన రెండు వన్డేల్లో విజయ ఢంకా మోగించిన శ్రీలంక 2-0తో సిరీ్‌సను కైవసం చేసుకుంది. మూడు వన్డేల సిరీ్‌సలో భాగంగా బుధవారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా 110 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. టాస్‌ గెలిచి, తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 248 పరుగులు చేసింది. ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో (96), పతుం నిస్సంక (45), వికెట్‌కీపర్‌ కుశాల్‌ మెండిస్‌ (59) రాణించారు. భారత బౌలర్లలో రియాన్‌ పరాగ్‌ (3/54)కు మూడు, కుల్దీప్‌, వాషింగ్టన్‌, అక్షర్‌, సిరాజ్‌లకు తలో వికెట్‌ లభించాయి. ఆఫ్‌స్పిన్నర్‌ దునిత్‌ వెల్లలగే విజృంభించడంతో (5/27) ఛేదనలో టీమిండియా 26.1 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటై ఓటమి పాలైంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (35), టెయిలెండర్లలో వాషింగ్టన్‌ సుందర్‌ (30) మినహా మరే ఆటగాడు 30 పరుగులు కూడా చేయకపోవడం గమనార్హం. త్రుటిలో సెంచరీ కోల్పోయిన ఓపెనర్‌ అవిష్క ఫెర్నాండోకు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు, సిరీ్‌సలో 7 వికెట్లు, 108 పరుగులు సాధించిన దునిత్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు లభించాయి. ఇక, ఈ సిరీ్‌సలో స్పిన్నర్ల చేతిలో భారత్‌ 27 వికెట్లు కోల్పోవడం, టీమిండియా బ్యాటింగ్‌ లైన్‌ప బలహీనతలను బయటపెట్టింది. ఇప్పటివరకు ఏ ద్వైపాక్షిక సిరీ్‌సలోనూ (3 వన్డేలు) స్పిన్నర్లకు భారత్‌ ఇన్ని వికెట్లు కోల్పోలేదు.

Updated Date - Aug 08 , 2024 | 05:26 AM

Advertising
Advertising
<